Sandeep Kishan | Flat buys | VV Vinayak | Run Movie

Sandeep kishan bought vv vinayak house

Sandeep Kishan buys VV Vinayak house, Sandeep Kishan bought VV Vinayak house, Sandeep Kishan new flat, Sandeep Kishan Buys House, Sandeep Kishan House, Sandeep Kishan movies, Sandeep Kishan movie updates, Sandeep Kishan stills

Sandeep Kishan bought VV Vinayak house: Tollywood hero Sandeep Kishan has successfully achieved one of his personal goal.

మొదటి కోరిక తీర్చుకున్న యంగ్ హీరో

Posted: 03/14/2016 05:36 PM IST
Sandeep kishan bought vv vinayak house

ఎట్టకేలకు హీరో సందీప్ కిషన్ ఓ ఇంటివాడయ్యాడు. ‘స్నేహగీతం’ సినిమాతో హీరోగా పరిచయమై, ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సందీప్ కిషన్. తనకున్న మూడు లక్ష్యాలలో ఒకదానిని ఇటీవలే నేరవేర్చుకున్నాడు. అసలు ఆ మూడు గోల్స్ ఏంటంటే... హైదరాబాద్ లో ఇల్లు, స్పోర్ట్స్ కారు, సొంత హోం థియేటర్.

ఇందులో మొదటిది హైదరాబాద్ లో ఇల్లు. తాజాగా హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కొని ఓ ఇంటివాడయ్యాడు. అదికూడా తన మావయ్యది కావడం. ‘ఏదో ఒక రోజు నీ అపార్ట్ మెంట్ కొంటాను’ అని చిన్నప్పుడు మామయ్యతో చెప్పానని సందీప్ కిషన్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తాను చెప్పినట్లుగానే మాదాపూర్ లోని నాలుగు బెడ్ రూముల తన మామయ్య ఫ్లాట్ ను కొనుకున్నాడు.

నిజానికి ముందు ఈ ఫ్లాట్ ను సందీప్ వాళ్ల మామయ్య దర్శకుడు వి.వి.వినాయక్ కు అమ్మేసాడు. ఆ తర్వాత ఇటీవలే వినాయక్ నుంచి సందీప్ కిషన్ కొనుగోలు చేసాడు. ఎట్టకేలకు తన చిన్ననాటి కోరిక తీరడంతో చాలా సంతోషంగా వున్నాడు సందీప్. తన ఫ్లాట్ చాలా బాగుందని, ఇక్కడ నుంచి చూస్తే దుర్గం చెరువు కనిపిస్తుందని, గత ఏడేళ్లుగా తాను కష్టపడి సంపాదించి, దాచుకున్న డబ్బుతో ఈ ఫ్లాట్ కొనుగోలు చేసానని సందీప్ కిషన్ ఆనందం వ్యక్తం చేసాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandeep Kishan  Buys  Flat  Home  VV Vinayak  stills  

Other Articles