Heroine Swathi Reddy | Love | Mother Fight | Police case

Actress swathi reddy love fight

Heroine Swathi Reddy Love Fight, Heroine Swathi Reddy Fight, Swathi Reddy police case, Swathi Reddy love issue, Swathi Reddy fight with mother, Swathi Reddy stills, Swathi Reddy in love film

Actress Swathi Reddy Love Fight: Tollywood upcoming young actress Swathi Reddy fight with her mother in Banjara hills Police Station.

హీరోయిన్ ప్రేమకు తల్లి అడ్డు.. స్టేషన్లో ఫైటింగ్

Posted: 02/26/2016 05:42 PM IST
Actress swathi reddy love fight

హీరోయిన్ హీరోతో ప్రేమలో పడటం.. ఈ విషయం తెలిసిన తల్లితండ్రులు అడ్డుపడటం... దీంతో ఇంటి నుంచి హీరోయిన్ వెళ్లిపోవడం, ఆ తర్వాత తన కూతురుకి మాయమాటలు చెప్పి, డబ్బుల కోసమే మోసం చేసాడంటూ హీరోపై హీరోయిన్ తల్లితండ్రులు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాడం.. ఆ తర్వాత హీరోయిన్ మరియు తల్లితండ్రులు పోలీస్ స్టేషన్లో చర్చలు జరపడం... ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఇదే కథ నిజజీవితంలో యువ హీరోయిన్ కు వచ్చింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్న స్వాతిరెడ్డి అనే నటి పరిస్థితి కూడా ఇలాగే అయ్యింది. తన కూతురుని శ్రీనివాస్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి, ఆస్తి కోసం కిడ్నాప్ చేసాడంటూ స్వాతి రెడ్డి తల్లి నాగేంద్రమ్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు స్వాతిరెడ్డిని పిలిచి విచారించగా.. ఆస్తి కోసమే తన తల్లి ఇబ్బంది పెడుతోందంటూ స్వాతిరెడ్డి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీస్ స్టేషన్లోనే తల్లి కూతుళ్ల మధ్య పరస్పర వివాదం ఏర్పడింది. పోలీసులు వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి స్వాతిరెడ్డిని ఇంటికి పంపించారు. నాగేంద్రమ్మను పోలీసులు విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi Reddy  Police station  mother fight  love movie  stills  

Other Articles