Hero Nani To Romance With Surabhi And Niveda Thomas In His Latest Flick | Tollywood Updates | Nani Movies

Hero nani to romance with two actresses surabhi niveda thomas tollywood updates

nani news, nani movies, nani latest movie, nani movie updates, actress surabhi news, surabhi with nani, niveda thomas news, niveda thomas with nani, nani romance with surabhi niveda thomas, nani indraganti mohan krishna movie

Hero Nani To Romance With Two Actresses Surabhi Niveda Thomas Tollywood Updates : Hero Nani To Romance With Surabhi And Niveda Thomas In His Latest Flick Which Is To Be Directed By Indraganti Mohana Krishna.

ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న నాని

Posted: 10/01/2015 12:01 PM IST
Hero nani to romance with two actresses surabhi niveda thomas tollywood updates

మూడేళ్ల తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కిన హీరో నాని కెరీర్ ని ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఓ రేంజుకు తీసుకెళ్లింది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ భారీ వసూళ్లు రాబడుతున్న ఆ చిత్రం నానికి సరికొత్త ఉత్తేజాన్ని అందించింది. ఆ సినిమా పుణ్యమా అని ఈ హీరోకి ఇప్పుడు మళ్లీ వరుసగా అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే హను రాఘవాపూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న నాని.. అప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తనని హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ఓ ప్రేమకథా చిత్రంలో నటించేందుకు నాని అంగీకారం తెలిపినట్లు సమాచారం.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ హీరో సరసన ఓ హీరోయిన్ గా బ్యూటిఫుల్ సురభిని ఎంపిక చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేసారు. మలయాళ భామ నివేద థామస్ ని సెకండ్ హీరోయిన్ గా ఓకే చేసినట్లు తెలిసింది. నివేద ఇటీవలే కమల్ హాసన్ నటించిన ‘పాపనాశం’ సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు.. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ‘జూలియట్ – లవ్ అఫ్ ఇడియట్’ లో కూడా నివేద హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రాఘవాపూరి డైరెక్షన్ లో నాని నటిస్తున్న చిత్రం పూర్తి కాగానే.. ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Nani Latest news  Surabhi Updates  Niveda Thomas Movies  

Other Articles