Naga Chaitanya Latest Premam Remake Movie Title Fixed As Majnu | Tollywood Gossips

Naga chaitanya premam remake movie title majnu

naga chaitanya news, naga chaitanya majnu movie, premam telugu remake, premam movie updates, premam movie remake news, telugu movies, tollywood news, naga chaitanya updates, majnu telugu movie, majnu telugu news

Naga Chaitanya Premam Remake Movie Title Majnu : Naga Chaitanya Latest Premam Remake Movie Title Fixed As Majnu.

అమ్మాయి ప్రేమలో ‘మజ్ను’గా మారిన చైతూ

Posted: 09/24/2015 06:54 PM IST
Naga chaitanya premam remake movie title majnu

అవును.. ఇంకా పెళ్లి చేసుకోని యంగ్ లవర్ బాయ్ నాగచైతన్య ఓ అమ్మాయి ప్రేమలో ‘మజ్ను’గా మారాడు. తన ప్రేమను ఆ అమ్మాయికి చెప్పి, ఆమెను దక్కించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే.. స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి చైతూ ఆ అమ్మాయి వెంట పడుతున్నాడని తెలిసింది. ఇదంతా చూస్తుంటే ఏదో సినిమా స్టోరీలా వుంది కదా! అవును.. ఇది సినిమా స్టోరీనే! చైతూ ‘మజ్ను’గా మారి లైలా కోసం వెతుకుతోంది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదల మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ అక్కడ అనూహ్యమైన విజయం సాధించింది. ఈ సినిమాపై మనసు పారేసుకున్న నాగచైతన్య.. తెలుగు రీమేక్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చందూ మొండేటి దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాలో కథానాయికగా ‘ప్రేమమ్’ చిత్రంలో నటించిన హీరోయిన్నే ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా స్టోరీ లైన్ ఎలా వుంటుందుంటే.. స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ పుడుతుంది. ముందుగా హీరో ఆమె ప్రేమలో పడగా.. తన వెంటే పడతాడు. ఇక అక్కడి నుంచి వీరి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. కథ ప్రకారం.. ఈ సినిమాకి కొన్ని పేర్లను టైటిల్ గా పరిశీలించారు. చివరగా ‘మజ్ను’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. గతంలో నాగార్జున హీరోగా ‘మజ్ను’ సినిమా వచ్చింది. అప్పట్లో అది గొప్ప ప్రేమకథా చిత్రంగా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్ నే నాగచైతన్య రీమేక్ మూవీకి ఖరారు చేశారు. మరి.. ఈ చిత్రం నాగ్ సినిమా రేంజులోనే హిట్ కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే! మరోవైపు.. ఈ చిత్రంలోనూ ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya updates  premam telugu remake  majnu telugu movie  

Other Articles