ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై.. యోగేష్ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్ ‘చంద్రిక’. కార్తీక్ జయరామ్-కామ్న జెత్మలాని-శ్రీముఖి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ అధినేత్రి వి.ఆశ మాట్లాడుతూ... ‘మా దర్శకుడు యోగేష్ ‘చంద్రిక’ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు. సాజిద్ ఖురేషి సమకూర్చిన కథ-స్క్రీన్ప్లే, అర్టిస్టు అభినయం, మా మ్యూజిక్ డైరెక్టర్ గున్వంత్సేన్ రీరికార్డింగ్తోపాటు గ్రాఫిక్స్ ‘చంద్రిక’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అన్నారు.
దర్శకుడు యోగేష్ మాట్లాడుతూ... ‘మా నిర్మాత ఆశ మేడమ్ మరియు ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరి సంపూర్ణ సహాయ సహకారాల వల్లే ‘చంద్రిక’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొనేలా రూపొందింది’ అన్నారు.
గిరీష్ కర్నాడ్, ఎల్.బి.శ్రీరాం, సత్యం రాజేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి-కరుణాకర్ అడిగర్ల, సంగీతం: గున్వంత్సేన్, కథ-స్క్రీన్ప్లే: సాజిద్ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్!!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more