Premante Suluvukadura Movie Post Production Works

Premante suluvukadura movie post production works

Premante Suluvukadura movie shooting completed, Premante Suluvukadura movie stills, Premante Suluvukadura movie news, Premante Suluvukadura movie shooting, Premante Suluvukadura movie latest updates, Premante Suluvukadura movie details, Premante Suluvukadura movie updates, Premante Suluvukadura stills

Premante Suluvukadura Movie Post Production Works: Rajeev saloori latest upcoming film Premante Suluvukadura. This movie shooting completed. Simmy das heroine.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ప్రేమంటే సులువుకాదురా

Posted: 08/25/2015 09:58 AM IST
Premante suluvukadura movie post production works

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. రాజీవ్‌ సరసన సిమ్మిదాస్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందా గోవింద్‌రెడ్డి దర్శకత్వంలో.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డ~ శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. ‘ఆటో నడుపుకొనే అబ్బాయికి~ ఇంజనీరింగ్‌ చదువుకునే అమ్మాయికి’ మధ్య ఏర్పడిన ప్రేమ ఎటువంటి పరిణామాలకు దారి తీసిందనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత భవనాసి రాంప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు తెలుగులో వచ్చిన అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల జాబితాలో ‘ప్రేమంటే సులువు కాదురా’ కూడా స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకం మాకుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న చందా గోవింద్‌రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు సినిమాను ఎంతో బ్యూటిఫుల్‌గా.. చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దుతున్నాడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. త్వరలోనే ఆడియో విడుద చేయనున్నాం’ అన్నారు.

కాశీ విశ్వనాధ్‌, మధుమణి, చంటి, చమ్మక్‌చంద్ర, వైజాగ్‌ అప్పారావు, చిట్టిబాబు, ఖలీల్‌ భాషా ఇతర ముఖ్యపాత్రు పోషిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: గోవిందరెడ్డి ~సుమన్‌, పాటలు : కృష్ణ మదినేని, సంగీతం: నందన్‌రాజ్‌, ఛాయాగ్రహణం: సురేష్‌ రఘుట, ఎడిటింగ్‌: యస్‌.బి.ఉద్ధవ్‌, సహనిర్మాతలు: కొమారి సుధాకర్‌రెడ్డి` శ్రీపతి శ్రీరాములు, నిర్మాత: భవనాసి రాంప్రసాద్‌, కథ~ మాటలులు ~ స్క్రీన్‌ప్లే~ దర్శకత్వం: చందా గోవింద్‌రెడ్డి!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Premante Suluvukadura  shooting completed  stills  news  gallery  

Other Articles