Anushka talks about her marriage

Anushka talks about her marriage

Anushka clarifies on her marriage, Anushka talks about her marriage, Anushka latest news, Anushka baahubali movie news, Anushka latest updates, Anushka stills, Anushka hot news, Anushka baahubali stills, Anushka

Anushka talks about her marriage: Telugu, tamil star actress anushka upcoming film Baahubali. This film will be release on 10 july. SS Rajamouli direction.

ప్రేమ, పెళ్లి కబుర్లు చెప్పిన దేవసేన

Posted: 06/29/2015 04:45 PM IST
Anushka talks about her marriage

టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్క నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం జులై 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో అనుష్క పాల్గొంటూ బిజీగా వుంది.

అయితే ఈ సంధర్భంగా అనుష్క ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి వివరాలను చెప్పుకొచ్చింది. గతకొద్ది కాలంగా అనుష్క పెళ్లి గురించి రకరకాల వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలపై అనుష్క స్పందిస్తూ.. స్త్రీకి వివాహం చాలా ముఖ్యం అనే విషయం తెలుసని, కానీ ప్రస్తుతం దాని గురించి ఆలోచించే సమయం తనకు లేదని, ఇంకా తాను పూర్తి చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయని తెలిపింది. అయితే ఈలోపు ప్రేమ పుట్టొచ్చు లేదా తన తల్లితండ్రులే మంచి వరుడిని చూడోచ్చని, కానీ ఏ విషయాన్నైనా ఆ పెళ్లి సమయం వచ్చినప్పుడు తానే బహిరంగంగా అందరికీ తెలిసేలా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. అంతవరకూ తన ప్రేమ, పెళ్లి గురించి ఎవరేం చెప్పినా నమ్మవద్దంటూ తెలియజేసింది.

‘బాహుబలి’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, అనుష్క నటించిన మరో చిత్రం ‘రుద్రమదేవి’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైజ్ జీర్’. మరి ఈ చిత్రాలన్నీ పూర్తయ్యాక అనుష్క పెళ్లి చేసుకుంటుందో లేదో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Baahubali  devasena  marriage  interview  

Other Articles