Mahesh Babu Brahmotsavam Release Date Confirmed

Mahesh babu brahmotsavam release date confirmed

Mahesh Babu Brahmotsavam Release Date, Mahesh babu latest news, Mahesh babu movie news, Mahesh babu movie updates, Mahesh babu Brahmotsavam news, Mahesh babu Brahmotsavam updates, Mahesh babu Brahmotsavam stills, Mahesh babu Brahmotsavam, Samantha, Kajal, Pranitha

Mahesh Babu Brahmotsavam Release Date Confirmed: Mahesh babu Srikanth addala upcoming film Brahmotsavam. Samantha, Kajal, Pranitha heroines. PVP Producer.

సంక్రాంతికే సందడి చేయనున్న మహేష్ బ్రహ్మోత్సవం

Posted: 06/29/2015 10:07 AM IST
Mahesh babu brahmotsavam release date confirmed

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ PVP బ్యానర్ పై ప్రసాద్ వి.పోట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఇందులో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లు జతకడుతున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత. అయితే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే విడుదల తేదిని కూడా ప్రకటించేసారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయడానికి నిర్ణయించారు.

మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం గతంలో సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించింది. అందుకే అదే సెంటిమెంట్ ను ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి కూడా ఫాలో అవుతున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh babu  Brahmotsavam  Release Date  Samantha  Kajal  Pranitha  

Other Articles