Timmiri movie | Release date | Trailers

Timmiri movie release on 25 april

Simbu Timmiri movie release date, Timmiri movie release date, Timmiri movie stills, Timmiri movie posters, Timmiri movie news, Timmiri movie updates, Timmiri movie photos, Timmiri movie trailers, Timmiri movie

Timmiri movie release on 25 April: simbu osti movie dubbing into telugu as Timmiri. Richa gangopadhyay heroine. thaman music. timmiri movie release on 25 april.

గబ్బర్ సింగ్ కు పోటీగా శింబు తిమ్మిరి

Posted: 04/17/2015 10:25 AM IST
Timmiri movie release on 25 april

హిందీలో హిట్టయ్యిన సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ చిత్రాన్ని తెలుగులో ‘గబ్బర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే ‘దబాంగ్’ చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేసారు.

శింబు హీరోగా ‘ఒస్తీ’ అనే పేరుతో రీమేక్ చేసారు. శింబు, రిచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై పర్వాలేదనిపించుకుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు.

‘ఒస్తీ’ చిత్రాన్ని తెలుగులో ‘తిమ్మిరి’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ‘బంగారం’ ఫేం దర్శకుడు ఎస్.ధరణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ‘దబాంగ్’లో విలన్ పాత్రలో నటించిన సోనూసూద్... మళ్లీ ఈ ‘తిమ్మిరి’లో కూడా అదే పాత్రలో నటించాడు.

అక్కడక్కడ కొన్ని పాత్రధారులు వేరు తప్ప... మిగతాదంతా.. సేమ్ టు సేమ్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు విడుదలయ్యాయి. త్వరలోనే ఆడియో కూడా విడుదల చేయనున్నారు. ‘తిమ్మిరి’ చిత్రాన్ని ఈనెల 25న 500 థియేటర్లకు పైగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

అసలే ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని చూసి ఆదరించిన ప్రేక్షకులు మరి ఈ ‘తిమ్మిరి’ చిత్రాన్ని ఎలా చూస్తారో ఏమో. నిర్మాతలు ఈ సినిమా ద్వారా కలెక్షన్లు రాబడుతారో లేక నష్టపోతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Timmiri movie  Release date  Trailers  

Other Articles