Prabhudeva akshay kumar singh is bling movie story

prabhudeva news, prabhudeva latest news, prabhudeva singh is bling movie, akshay kumar singh is bling movie, prabhudeva akshay kumar news, prabhudeva akshay kumar movies, singh is bling movie story, akshay kumar movies

prabhudeva akshay kumar singh is bling movie story : akshay kumar suggested prabhu deva to change the story of singh is bling movie. So that the schedule of this movie is changed.

ప్రభు‘దేవా’... కథ అడ్డం తిరిగింది!

Posted: 01/24/2015 03:16 PM IST
Prabhudeva akshay kumar singh is bling movie story

ఇండియన్ మైఖేల్ జాక్సన్’గా పేరొందిన ప్రభుదేవా.. గతకొన్నాళ్ల నుంచి బాలీవుడ్’లో దర్శకుడిగా చెలామణి అవుతున్న విషయం తెలిసిందే! తెలుగు, తమిళ చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తూ వరుసగా విజయాలు అందుకున్నాడు. పైగా ఇతను తీసిన చిత్రాలన్నీ 100 కోట్ల క్లబ్’లోకి చేరిపోవడంతో బాలీవుడ్ ఈ దక్షిణాది దర్శకుడికి బ్రహ్మరథం పట్టింది. అయితే.. ఇటీవలే ప్రభు తీసిన రెండు, మూడు చిత్రాలు ఫ్లాప్ కావడంతో అతని ప్రభ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఒకప్పుడు అతను చెప్పిందే వేదంగా భావించి పాటించేవాళ్లు.. ఇప్పుడు ఇతనికే సలహాలు ఇస్తున్నారంటే.. ప్రస్తుతం ప్రభు పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. అందుకు ఉదాహరణగా.. తాజాగా ఇతనికి ఎదురైన ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.

ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! దాంతో ఆ మూవీ పనుల్లోనే బిజీ అయిన ప్రభు.. ఆ చిత్రంకోసం ఇటీవల ఓ స్ర్కిప్టును సిద్ధం చేసుకున్నాడు. ఆ స్ర్కిప్టును తీసుకెళ్లి అక్షయ్’కి వినిపించగా.. అంతా విన్న తర్వాత అతనికి ఆ స్టోరీ నచ్చలేదంటూ నిర్మొహమాటంగా ప్రభుతో చెప్పేశాడట! స్ర్కిప్ట్ చాలా పూర్’గా వుంది.. ఇందులో చాలా మార్పులు చేయాల్సిందేనని అతనికి సలహాలు కూడా ఇచ్చాడట అక్కీ! ఆ హీరో చెప్పిన మాటలకు ఉసూరమన్న ప్రభు.. అతను చెప్పినట్లుగానే కథలో మార్పులు చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడని సమాచారం! దీంతో త్వరలోనే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్.. నిరవధికంగా వాయిదా పడిపోయింది. ఇదీనండి.. ప్రస్తుతం ప్రభుదేవా పరిస్థితి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhudeva latest news  akshay kumar news  singh is bling movie updates  

Other Articles