Trisha krishnan varun manian engagement news chennai five star hotel venue

trisha krishnan engaged, trisha varun engaged, trisha engagement news, trisha krishnan latest news, trisha marriage news, trisha krishnan marriage news, trisha varun marriage news

Trisha krishnan Varun manian engagement news chennai five star hotel venue : finally the hot actress trisha krishna got engaged with varun manian on friday in chennai at 12 noon.

నిశ్చితార్థం ముగిసింది.. పెళ్లి మిగిలింది..

Posted: 01/23/2015 04:55 PM IST
Trisha krishnan varun manian engagement news chennai five star hotel venue

సినీ నటి త్రిష క్రిష్ణన్, పారిశ్రామికవేత్త వరుణ్ మనియన్’ల నిశ్చితార్థం హిందూ సంస్కృతి-సంప్రదాయాల ప్రకారం కుటుంబసభ్యుల సమక్షంలో శుక్రవారం (23-01-2015) మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్’లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకకు బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. నిశ్చితార్థానికి విచ్చేసిన వారందరూ ఈ జంటను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. గతంలో తెలిపినట్లుగానే ఈ అమ్మడి నిశ్చితార్థం చివరికి జరిగిపోయింది.

అంతా అనుకున్నట్లుగానే త్రిష నిశ్చితార్థం జరిగింది కానీ.. పెళ్లి తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. తన ఎంగేజ్’మెంట్ అయిన రోజే పెళ్లితేదీని తెలుపుతానని పేర్కొన్న త్రిష.. ఆ ఆనందంలో ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. నిశ్చితార్థం ముగిసిన సందర్భంగా తన వరుడితోపాటు కుటుంబసభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటోంది. అలాగే తన స్నేమితులందరికీ వరుడు వరుణ్’ని పరిచయం చేయిస్తూ, సంతోషంగా వుందని కోలీవుడ్ సమాచారం!

ఇదిలావుండగా.. వీరిద్దరు తమ పెళ్లిని మరింత ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని సన్నిహితవర్గాలు తెలుపుతున్నాయి. కొంతమంది వీళ్లు విమానంలో పెళ్లి పెళ్లి చేసుకోవచ్చని చెబుతుంటే.. విదేశాల్లో ఏదైనా ఒక అద్భుతమైన ప్రదేశంలో చేసుకునే ఆస్కారం వుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే.. వీరి పెళ్లి చెన్నైలోనే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా వున్నాయని సన్నిహితులు తెలుపుతున్నారు. ఏదైతేనేం.. ప్రస్తుతం నిశ్చితార్థం సందర్భంగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుదాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha varun engagement  trisha krishnan marriage news  

Other Articles