Nithin chinnadana neekosam audio platinum disk tirupati

nithin tirumala visit, nithin edukondalu walk, nithin chinnadana neekosam updates, chinnadana neekosam audio platinum disk highlights, chinnadana neekosam release date, chinnadana neekosam latest photos and teasers, chinnadana neekosam latest updates, chinnadana neekosam cast and crew, chinnadana neekosam review, tirumala temple timings, tirumala temple ticket booking, latest news updates

nithin chinnadana neekosam audio platinum disk tirupati : lover boy hero nithin latest movie chinnadana neekosam movie ready to release on 25th december, nithin visited tirumala by walking 7hills also called edukondalu

చిన్నదానికై తండ్రి ఆరాటం.., కొడుకు పోరాటం

Posted: 12/20/2014 11:26 AM IST
Nithin chinnadana neekosam audio platinum disk tirupati

నితిన్ కు పెళ్లి చేయాలని ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ఆరాటపడుతుండగా..., తండ్రి కోరిక నెరవేరాలని నితన్ పోరాటం చేస్తున్నాడు. చిన్నదాని కోసం చాలా కష్టాలే పడుతున్నాడు. సినిమా వేడుకల సమయంలో కూడా.., ఖాళీ దొరికిందంటే చిన్నదాని కోసం ఆలోచిస్తున్నాడు. ఆడియో ప్లాటినం డిస్క్ వేడుకల కోసం తిరుపతి వెళ్ళిన నితిన్.., తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మామూలుగా దర్శించుకుంటే పెద్ద విశేషమేం కాదు. కానీ.., ఈ హీరో మాత్రం ఏడు కొండలు కాలినడకన వెళ్ళి మరీ శ్రీనివాసుడిని మొక్కుకున్నాడు.

చాలా కష్టపడి ఏడు కొండలు ఎక్కానంటూ ఫేస్ బుక్ లో సెల్పీ పెట్టాడు. ఇంతకీ అంత కష్టపడి వెళ్ళి ఏం కోరుకున్నాడంటే.., ‘బయటకు చెప్తే కోరికలు తీరవు’గా అని చాటుకు తప్పించుకున్నాడు. తనకు చక్కనైన చిన్నది దొరకాలనో లేక.., తాను నటించిన ‘చిన్నదాన నీకోసం’ బాగా ఆడాలని ఉండవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మిగతా విషయాలు చూస్తే.., తిరుపతిలో శనివారం (డిసెంబర్ 20) సాయంత్రం ఈ సినిమా ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక జరగనుంది. వరుసగా సినిమాలు హిట్ అవుతుండటంతో ఈ మూవీపై ‘దిల్’బాబు చాలా ఆశలే పెట్టుకున్నాడు.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ సోదరి నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మించింది. కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆయన గత సినిమాల్లాగే లవ్, యూత్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం తుదిదశ ఎడిటింగ్ పనులు జరుపుకుంటోన్న మూవీ పాటలు, ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది. ‘చిన్నదాన నీకోసం’కు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin latest  chinnadana neekosam update  tirumala temple  

Other Articles