Samantha comments on kaaviya thalaivan

samantha comments on kaaviya thalaivan, samantha on siddharth, siddharth next movie updates, siddharth samantha relationship, samantha on marriage, kaaviya thalaivan movie review rating, kaaviya thalaivan movie latest updates, koliwood latest updates

samantha comments on kaaviya thalaivan : tollywood actress samantha comments kaaviya thalaivan movie says this is a master piece movie and everyone must watch this. film personalities doubts on samantha comments about kaaviya thalaivan movie actually for movie or for hero of the movie

సినిమాను అడ్డంపెట్టి ఏం మాయ చేశావే

Posted: 12/03/2014 12:05 PM IST
Samantha comments on kaaviya thalaivan

ప్రాక్టికల్ మైండ్ తో పని చేసే కమర్షియల్ క్యారెక్టర్ చెన్నై భామ సమంతది. ఏదైనా తనకు అవసరం అనుకుంటే ఆకాశానికి ఎత్తేయటం.., లేకపోతే పక్కన పడేయటం ఈమెకు కొత్తేమి కాదు. తాను నటించే సినిమాల హీరోలు, డైరెక్టర్లను కామెంట్లతో కాకాపట్టి పనులు చేయించుకుని పబ్బం గడపటం ఈ భామకు అలవాటే. గతంలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తో పాటు ఈ మద్య విక్రమ్ ను కూడా కామెంట్లతో కడుపునింపి అన్నంతినకుండా చేసింది. తాజాగా తమిళ సినిమా ‘కావ్య తలైవన్’ చూసి కామెంట్ల వర్షం కురిపించింది.

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, బయట ఫ్రెండ్స్, మీడియా మైకులు ఇలా ఎక్కడ చాన్స్ ఉంటే అక్కడ ‘కావ్య తలైవన్’ కత్తి.., తురుము అంటూ చెప్పుకొస్తోంది. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్ లాంటిది.. అందరూ వెళ్లి చూడండబ్బా అని సలహా కూడా ఇస్తోంది. అయితే అతి వినయం దూర్జ లక్షణం అన్నట్లు.., ఇంతగా కామెంట్లు చేస్తుంటే అందరూ డౌట్ పడుతున్నారు. ‘కావ్య తలైవన్’ మూవీలో సిద్ధార్థ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. దీంతో ఇంతగా పొగిడేది సినిమానా లేక.., బాయ్ + ఫ్రెండ్ సిద్ధార్థ్ నా అని మనసులో అనుకుంటున్నారు.

సిద్దార్థ్ తో లవ్వాయణం పుకార్లను గతంలోనే ఖండించిన చెన్నై చిన్నది.., ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నా.., మూడేళ్ళలో పెళ్లి.., ఆ తర్వాత పిల్లలు అంటూ ఓ పంచవర్ష ప్రణాళికను ప్రకటించింది. సిద్దుతో యవ్వారం లేకపోయినా.., దోస్త్ కాబట్టి ఆ మాత్రం క్యూరియాసిటి ఉంటుందిలే అని సరదాగా కామెంట్ చేసుకుంటున్నారు. అసలే ముక్కుమీద కోపం ఉండే అమ్మడు.., తాజా డౌట్లను ఎలా క్లారిఫై చేస్తుందో చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaaviya thalaivan  samantha  siddharth  koliwood  

Other Articles