Sruti hassan leaves mahesh babu movie shooting in the middle for vijay movie

mahesh babu latest movie updates, mahesh babu sruti hassan movie updates, mahesh babu sruti hassan photos, mahesh babu latest movie with koratala shiva, mahesh babu koratala shiva movie latest update, mahesh babu next movie release date, mahesh babu koratala shiva movie cast and crew, sruti hassan on mahesh babu movie, mahesh babu escapes from mahesh babu movie, mahesh babu pune shooting, tollywood latest updates, sruti hassan vijay movie latest update

sruti hassan leaves mahesh babu movie shooting in the middle for vijay movie : mahesh babu latest movie with koratala shiva seems to be late in release heroine of the movie sruti hassan leaves in the middle of pune shooting schedule for vijay movie in tamil

నమ్ముకుంటే నడిరోడ్డుపై వదిలి పుట్టింటికి వెళ్లింది

Posted: 11/21/2014 08:06 AM IST
Sruti hassan leaves mahesh babu movie shooting in the middle for vijay movie

పుట్టింటిపై మమకారం ఏ ఆడపిల్లకైనా చావదు. ఎన్నాళ్ళయినా.., ఎంత దూరంలో ఉన్నా పుట్టిల్లు అంటే ఎక్కడలేని ప్రేమాభిమానాలు పొంగుకొస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బంది కల్గిస్తాయి. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన పనికి టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాధపడుతున్నాడు. నమ్ముకుంటే ఇలా చేసిందేమిటా అని  అర్ధంకాక తలపట్టుకుంటున్నాడు. మహేష్- కొరటాల శివ కాంబినేషన్ లో కొత్తగా సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసందే. ఈ మూవీ షూటింగ్ ఈ మద్యే పూణేలో మొదలు పెట్టారు.

నిర్ణీత సీన్ల కోసం షెడ్యూల్ ప్లాన్ చేసుకుని మూవీ యూనిట్ పూణేకు వెళ్ళింది. ఈ ప్రాజెక్టులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మహేష్, శృతి హాసన్ పై పలు సీన్లు షూట్ చేశారు. అయితే ఇంకా షెడ్యూల్ మిగిలి ఉండగా., సీన్లు మొత్తం పూర్తి కాకముందే శృతి చెన్నై చెక్కేసిందట. నాకు అక్కడ వేరే షూటింగ్ ఉంది.., వెళ్లక తప్పదు అని చెప్పిందట. మరి మా సంగతేమిటి అంటే.., అది తర్వాత చూద్దాం. లేదంటే మీరు కానివ్వండి.., నేను మద్యలో వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పేసి పూణే ట్రిప్ కు ప్యాకప్ చెప్పేసిందట.

ఇలా ఊరు కాని ఊరిలో.., నమ్ముకుని వస్తే.. నడి రోడ్డుపై వదిలి వెళ్ళటంతో మహేష్ తో పాటు మూవీ యూనిట్ కూడా షాక్ అయిందట. ఇందుకు కారణం ఏమిటంటే.., తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా ఓ సోషియో ఫాంటసీ సినిమా వస్తుంది. ఈ ప్రాజెక్టులో కలువకళ్ళ భామ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలోనే ప్రాజెక్టు కోసం బల్క్ గా డేట్లు ఇచ్చేసిందట. అయితే మద్యలో ఖాళీ ఎందుకు మహేష్ మూవీ చేసుకుంటే పోలా అన్నట్లు పూణేకు వచ్చింది. కాని మధ్యలో సీన్ రివర్స్ అయింది. డేట్లు ఇచ్చారు.. ఎప్పుడు వస్తున్నారు అని విజయ్ టీం నుంచి ఫోన్ రావటంతో ఉన్నఫలంగా చెన్నై చెక్కేసింది.

ఈ భామ పుట్టిళ్ళయిన తమిళ ఇండస్ర్టీపై ప్రేమను ఎవరూ కాదనలేరు. కాని ఆమెను అవకాశం ఇచ్చిన టాలీవుడ్ పరిస్థితి ఏమిటి. ప్రస్తుతం శృతి వల్ల ఈ మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.., డిసెంబర్ మొదటి వారం వరకు విజయ్ మూవీలో నటిస్తుందట. ఆ తర్వాత తిరిగి మహేష్ మూవీలో జాయిన్ అవుతుందని మేనేజర్లు చెప్తున్నారు. మంచి పేరున్న నటుడు కమల్ కూతురు కదా తెలుగు ఇండస్ర్టి పిలిచి అవకాశం ఇస్తే రెక్కలు రాగానే ఇలా సొంతగూటికి పయనం అయితే ఫ్యూచర్ లో చెడ్డపేరు వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  koratala shiva  sruti hassan  latest news  vijay  

Other Articles