Thaman to give music for akhil debut

akhil first movie latest updates, akhil latest photos, thaman music for akhil movie, vv vinayak for akhil movie, tollywood latest updates

thaman to give music for akhil debut : akkineni akhil all set to go f0r his debut with vv vinayak and latest information that thaman will compose music for this movie

అఖిల్ మూవీ లేటెస్ట్ లీక్.. టాక్

Posted: 11/13/2014 02:34 PM IST
Thaman to give music for akhil debut

అక్కినేని ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్న మిస్సైల్ అఖిల్ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి తెలిసింది. అక్కినేని నట వారసుడి తొలి సినిమాకు తమన్ సంగీతం అందించనున్నట్లు టాక్ విన్పిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ నిర్ణయంతో అక్కినేని అభిమానులు నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. డప్పులు కొట్టినట్లుండే తమన్ సంగీతం భారీ అంచనాలతో వస్తున్న అఖిల్ తొలి మూవీకి అవసరమా అని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు. జిమ్ కు వెళ్ళి కండలు పెంచటంతో పాటు, బాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఈ డెబ్యూలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అన్న పూర్ణ స్టూడియోస్ సమర్పణలో, శ్రేష్ట్ మీడియా బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం వినాయక్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్

అఖిల్ తొలి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నాగార్జున ఇండస్ర్టీలో మంచి పేరున్న వ్యక్తులతో  సినిమా చేయిస్తున్నారు. కధను వెలిగొండ శ్రీనివాస్ అందిస్తుండగా, కోన వెంకట్-గోపి మోహన్ స్ర్ర్కీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. మూడ్రోజులు ఆగితే అంటే నవంబర్ 15న ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. అన్నట్లుగా ఈ సినిమాలో నితిన్ ఓ గెస్ట్ రోల్ లో కన్పిస్తాడు అని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhil  thaman  vv vinayak  latest news  

Other Articles