Pvp movie banner shows interests to make movie with adah sharma

adah sharma next movie, adah sharma in pvp banner movie, adah sharma in allu arjun movie latest news, adah sharma latest hot photos, pvp banner movies, allu arjun movie latest updates, tollywood latest news updates

pvp movie banner shows interests to make movie with adah sharma : heart attack heroine adah sharma got big offer that pvp banners plans to make a movie with her

పెద్ జాక్ పాట్ కొట్టేసింది... ఇక లైఫ్ సెట్ అయినట్లే

Posted: 11/13/2014 10:58 AM IST
Pvp movie banner shows interests to make movie with adah sharma

తొలి సినిమా ‘హార్ట్ ఎటాక్’తోనే తానేంటో నిరూపించుకున్న అదాశర్మ జాక్ పాట్ కొట్టేసింది. ఆమె నటన, గ్లామర్ చూసిన పెద్ద బ్యానర్ అదాతో సినిమా చేయాలని డిసైడ్ అయింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై హీరోయిన్ తో సంతకం చేయించుకుంటామని బ్యానర్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఏ బ్యానర్ అనేది చెప్పలేదు కదా.., ప్రస్తుతం భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న ‘పీవీపీ బ్యానర్’. ‘అత్తారింటికి దారేది’ వంటి హిట్ సినిమాలు నిర్మించిన బ్యానర్ గా పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలో నటిస్తున్న అదా.., ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో డాన్స్ చేసింది. ఇందుతో తనలోని టాలెంట్ పూర్తిగా చూపించింది. అదా ప్రదర్శనకు చాలామంది ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ క్రమంలోనే పీవీపీ బ్యానర్స్ అధినేత కూడా టాలెంట్ చూసి ఆశ్చర్యపోయాడట. సన్నగా ఉన్న పిల్ల ఇలా చేస్తోందేంటి.., మన సినిమాలోకి తీసుకుంటే బాగుంటుంది అని భావించినట్లు వరప్రసాద్ సన్నిహితులు చెప్తున్నారు. బన్నీ సినిమాలో అదా యాక్టింగ్ సన్నివేశాల రష్ తెప్పించుకుని చూశారట. ఇందులో కూడా బాగా నటించటంతో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.

త్వరలోనే అదాశర్మతో పీవీపీ బ్యానర్స్ సినిమా ఉంటుందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బహుశా ఇది లేడి ఓరియంటెడ్ సినిమాగా ఉంటుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు చేయగల సత్తా ఆమెకు ఉన్నందునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. హిందీ సినిమా 1920లో కూడా చాలాబాగా నటించిందని మెచ్చుకున్నారు. తొలి సినిమా హిట్ కాగా.., ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టు బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. అంతలోనే పెద్ద బ్యానర్ నుంచి ఆఫర్ వచ్చింది. అమ్మడు ఏం తొక్కి ఇండస్ర్టీకి వచ్చిందో కాని లక్కులు చాలా కిక్కు ఇస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అదా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adah sharma  pvp banners  allu arjun  latest news  

Other Articles