Pawan kalyan speech at bhakti tv koti deepothsavam programme

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan speech, pawan kalyan bhakti tv koti deepothsavam, koti deepothsavam programme, pawan kalyan movie updates, pawan kalyan wikipedia, pawan kalyan updates, ravishankar guruji

pawan kalyan speech at bhakti tv koti deepothsavam programme

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు!

Posted: 11/03/2014 01:18 PM IST
Pawan kalyan speech at bhakti tv koti deepothsavam programme

పవన్ కల్యాణ్ నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ‘‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు’’ అనే ఈ డైలాగు అందరికీ తెలిసే వుంటుంది. అది సినిమా నేపథ్యంలో రాసిన డైలాగే అయినా.. నిజజీవితంలో అవి పవన్ కు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవడానికి తాజాగా జరిగిన ఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికే ప్రజలమనిషిగా పేరుగాంచిన పవన్.. మరోసారి తన సంప్లిసిటీని చాటుకున్నాడు.

హైదరాబాదులో ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ వారు కోటీదీపోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా ఏడోరోజు కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నాడు. అలాగే అతనితోపాటు ఆర్ట్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేదిక సందర్భంగా పవన్ కల్యాణ్ ను మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదంటూ జవాతెలిపారు. ‘‘నిజానికి నేను కూడా మీతో అక్కడ (జనాలమధ్య) కూర్చొని గురూజీ మాటలు వినడానికే వచ్చాను. వేదిక మీద నిలబడి మాట్లాడగలిగేంత వాడిని కాను.. మీలాగే వినడానికి వచ్చినవాడిని’’ అంటూ ముగించేశారు. దీంతో పవనుడు వినయానికి మారుపేరుగా మరోసారి నిలిచిపోయాడు.

ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అయినప్పటికీ కూడా వేదిక మీదవున్న పవన్ కు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించించడం విశేషం! దీనిని బట్టి అర్థం అయిందేమిటంటే.. ఆయన ఎక్కడికెళ్లినా ఫాలోయింగ్ మాత్రం ఖచ్చితంగా వుంటుందని తెలిసిపోతోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆధ్యాత్మికవేత్తలకు వేసే సింహాసనం వంటి కుర్చీనే పవన్ కు ఈ కార్యక్రమంలో ఆఫర్ చేశారట! అయితే దానిని సున్నితంగా తిరస్కరించి.. సాధారణమైన ప్లాస్టిక్ కూర్చీని తెప్పించి, అందులోనే కూర్చున్నారని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  koti deepothsavam programme  ravishankar guruji  bhakti tv  telugu news  

Other Articles