Raviteja kick2 shooting will start soon

ravi teja next movie, raviteja movies, raviteja kick2 movie updates, kick2 movie shooting updates, tollywood latest updates, rakul preet singh movies, kalyan ram next movie, raviteja donations to hudhud victims, hudhud cyclone updates

raviteja kick2 shooting will start : mass maharaja ravi teja hit movie kick sequel kick2 shooting wills start in this week says director and producer of the movie, film unit had hopes on story that it will give big hit than first movie

రెండో కిక్కు మొదలవుతుందట

Posted: 10/17/2014 11:04 AM IST
Raviteja kick2 shooting will start soon

రవితేజకు బాక్సాఫీస్ కలెక్షన్ల రుచి చూపించిన ‘కిక్’ సినిమా సీక్వెల్ వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఈవారంలో ప్రారంభం అవుతుందని డైరెక్టర్, ప్రొడ్యూసర్ తెలిపారు. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెప్పారు. వక్కంతం వంశీ స్ర్కిప్టును సిద్ధం చేసుకున్న సినిమా... షూటింగ్ లో రవితేజ, హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటారని చెప్పారు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా రవితేజకు టర్నింగ్ పాయింట్ ఇచ్చిందని చెప్పాలి. ఈ మూవీలో కామెడి, రవితేజ హడావుడి తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ బిగ్ హిట్ ను ప్రేక్షకుల కోసం సీక్వెల్ గా తీస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పతాకంపై సినిమా నిర్మిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’ సినిమాలతో ఇప్పుడిప్పుడే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటున్న రకుల్ రవితేజ సినిమాపై బాగా ఆశలు పెట్టుకుంది. మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజకు ‘కిక్2’ మరింత కిక్ ఇస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. షూటింగ్ ప్రారంభం అయితే సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుస్తాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja  kick2  rakul preet singh  latest updates  tollywood  

Other Articles