Nagarjuna on naga chaitanya marriage

nagarjuna on naga chaitanya marriage, naga chaitanya marriage, naga chaitanya next movie, oka laila kosam movie review, naga chaitanya movies, akkineni akhil, nagarjuna on akhil, naga chaitanya mother, akkineni akhil movie latest updates, tollywood latest updates

nagarjuna comments on nagachaitanya marriage : usually every father will take responsibility about their son or daughter marriage issue they plays main role in marriage issue but in when it comes to naga chaitanya, his father nagarjuna says that he will not look into this matter chaitu has to choose his life partner

చైతు పెళ్ళిపై చేతులెత్తేశాడు

Posted: 10/17/2014 09:30 AM IST
Nagarjuna on naga chaitanya marriage

బిడ్డలకు పెళ్లి చేయటం ప్రతి తల్లితండ్రుల బాధ్యత. కాని నాగ చైతన్య విషయంలో మాత్రం నాగార్జున అలా వ్యవహరిచటం లేదు. చైతు పెళ్ళితో తనకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. చైతు లైప్ పార్ట్ నర్ ను ఆయనే వెతుక్కోవాలన్నాడు. అంతేకాదు అఖిల్ జీవిత భాగస్వామి విషయంలో కూడా తాను జోక్యం చేసుకోబోను అని చెప్పాడు. సినిమాల వరకు అయితే ఏది మంచి, ఏది చెడు, ఎలా చేయాలి అని తాను దగ్గరుండి చూసుకోగలను కాని.., జీవితం విషయంకు వచ్చే సరికి మాత్రం నిర్ణయాలు వారే తీసుకోవాలంటున్నాడు.

‘ఒక లైలా కోసం’ విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన నాగార్జున.., మంచి రోజు చూసుకుని ఈ సినిమాను విడుదల చేస్తున్నామని.., మంచి ముహూర్తం కోసమే ఇన్ని రోజులు ఎదురుచూశామన్నారు. ‘మనం’ మూవీని కూడా మంచి ముహూర్తంలో విడుదల చేయటం వల్లే హిట్ వచ్చిందని చెప్తూ... తనకు మంచి రోజుల సెంటిమెంట్ ఉందన్నాడు. ప్రశ్నల్లో భాగంగా.., చైతు పెళ్లికి ముహూర్తం ఎప్పుడు. ఆయన జీవితంలోకి లైలా ఎప్పుడొస్తుంది? అని అడిగారు. దీంతో నాగార్జున నవ్వుతూ.. ‘పిల్లల పెళ్లి నా చేతుల్లో లేదు, ఎవరి జీవిత భాగస్వాములను వారే ఎంపిక చేసుకోవాలి’ అన్నాడు.

అయితే ఇది జోక్ అని కొందరు కొందరు అంటుండగా.., లేదు నిజంగానే అని ఉండవచ్చు అని మరికొందరు అంటున్నారు. చైతు, అఖిల్ సినిమాల గురించి దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటున్న నాగార్జున.., ఇక ఎవరికి వారే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేలా సిద్ధం చేస్తున్నాడు. ‘ఒక లైలా కోసం’ సినిమా విషయంలో ‘సినిమాలను ఇంకా తానే ప్రమోట్ చేయాలా.. ఎప్పుడు సొంతంగా చేసుకుంటారు’ అని నాగార్జున అడిగినట్లు చైతు చెప్పటం తెలిసిందే. దీన్నిబట్టి చూస్తే కింగ్ పిల్లలకు బాధ్యతలు అప్పగిస్తున్నాడన్నమాట.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  marriage  nagarjuna  oka laila kosam  

Other Articles