Pawan kalyan next movie with vv vinayak

pawan kalyan, pawan kalyan wiki, pawan kalyan marriages, pawan kalyan latest updates, pawan kalyan latest movies, pawan kalyan upcoming movies, pawan kalyan movie with vv vinayak, pawan kalyan wife, pawan kalyan son akhira nandan, pawan kalyan divorce, pawanism, pawan kalyan fans, gopala gopala, gopala gopala movie, gopala gopala latest updates, gopala gopala latest images, gopala gopala pawan kalyan, gopala gopala venkatesh, gopala gopala wallpapers, tollywood latest updates, movie news, telugu film gossips, vv vinayak, vv vinayak movies

there is one gossip that power star pawan kalyan met vv vinayak both discussed about a story and pawan agrees to act in that movie soon : vv vinayak wants to do movie with pawan kalyan soon after gopal

గోపాలుడి తర్వాత వినాయకుడే.. 2015లో విడుదల... ?

Posted: 10/09/2014 06:18 PM IST
Pawan kalyan next movie with vv vinayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల’ ప్రస్తుతం శరవేగంగ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆ మద్య హఫీజ్ పేట వద్ద బైక్ షూటింగ్ ఫొటో బయటకు రావటం పవన్ ఫస్ట్ లుక్ అంటూ తెగ ప్రచారం జరిగింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. షూటింగ్ సమయంలో కూడా సన్నివేశాలు, హీరో, హీరోయిన్లను ఎవరూ ఫొటోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పవన్ మల్టీ స్టారర్ సినిమా కావటంతో తెగ క్రేజ్ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే సినిమా యూనిట్ కూడా తెగ సీక్రెట్ పాటిస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి ఓ వార్త తెలిసింది. భారీ బడ్జెట్లతో సినిమాలు తీసే వివి వినాయక్ తో పవర్ స్టార్ ఓ సినిమా చేస్తున్నాడట. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పవన్-వి.వి. సమావేశం అయ్యారట. ఈ సందర్బంగా కళ్యాణ్ కు వినాయక్ కత్తి లాంటి కధ చెప్పాడట. ఇది విన్న పవన్ బాగుందని మెచ్చుకోవటంతో పాటు ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడట. దీంతో వివి తెగ సంతోషపడ్డాడు అని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్, క్రేజీ హీరోగా మారిపోయిన పవర్ స్టార్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ భావిస్తుండటం సహాజమే. కాని అందరికి రాని అవకాశం అన్నయ్యతో తీసిన విన్నికి వచ్చింది అని అంతా అనుకుంటున్నారు.

కధ ఓకే అయినా... హీరో సరే అన్నా.., ఈ సినిమా ఇప్పట్లో సెట్ పైకి వెళ్ళదు అని తెలుస్తోంది. ఎందుకంటే ఇద్దరికి వ్యక్తిగతంగా కమిట్ మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం ‘గోపాల గోపాల’ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ 2 సినిమా ఉండవచ్చు. అటు వి.వి. వినాయక్ మెగా స్టార్ చిరంజీవితో పాటు ఇతర స్టార్లకు కధలు సిద్ధం చేసుకుని ఉన్నాడు. ఇందులో అక్కినేని అఖిల్ ముందు వరుసలో ఉండగా.., మహేష్ బాబు, ఎన్టీఆర్ ఆ తర్వాత ఉన్నారు. మూడు సినిమాలు కాకపోయినా కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ సినిమా చూడాలంటే మరో ఏడాది ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  vv vinayak  tollywood  latest updates  

Other Articles