Nani challenge to rajamouli and krishna vamsi

nani, hero nani, hero nani wiki, nani movies, nani latest, nani gossips, nani, nani marriage, nani fasting, nani wife photo, telugu heros, telugu heroines, marriages, telugu marriages, rajamouli, rajamouli wiki, latest news, telugu latest news, telugu latest updates, andhrapradesh updates, telangana latest updates, krishna vamsi, fasting, good health tips, fasting for health, weight decrease tips, how to control weight

hero nani challenges directors rajamouli and krishnavamsi by he fasted for his wife and asks to do the same each for their own wife : there is a discussion about nani fasting challenge

జక్కన్న, వంశీ కడుపులు మాడ్చిన నాని

Posted: 10/08/2014 04:07 PM IST
Nani challenge to rajamouli and krishna vamsi

తనతో పెద్ద సినిమాలు చేసిన పెద్ద డైరెక్టర్లకే నాని చాలెంజ్ విసిరాడు. దమ్ముంటే మీరూ చేసి చూడండి అంటూ సవాల్ చేస్తున్నాడు. సినిమాలు చేయటం కాదు..., ఇది చేసి చూడంటి అంటూ వీడియో పెట్టిమరి రెచ్చగొడుతున్నాడు. ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్, ట్రీ చాలెంజ్ ఇలా రోజుకో చాలెంజ్ పుట్టుకొస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో మంచి కారణంతో వీటిని తీసుకువస్తున్నారు. తాజాగా హీరో నాని కూడా ఓ మంచి పని చేసేందుకు ఉపవాసం ఉంటున్నాడు. దేవుడి కోసం, అమ్మవారి కోసం ఉపవాసం ఉండటం అందరికి తెలిసిందే. అయితే నాని కాస్త డిఫరెంట్ కారణంతో ఉపవాసం ఉంటున్నాడు.

మనవాడు జీవిత భాగస్వామి కోసం ఒకరోజు పస్తుంటాడట. అవునండి భార్య కోసం ఒకరోజు తిండి మానేస్తున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 11న తనకెంతో ఇష్టమైన భార్య కోసం ఉపవాసం ఉంటున్నట్లు ఓ వీడియో కూడా నెట్ లో పెట్టాడు. ఇందుకు రెండు కారణాలున్నాయట. ఒకటి జీవితంలో కొత్త కోణంను చూపి.., జీవితాన్ని మరింత కలర్ ఫుల్ చేసిన తన భార్య కోసం ఏదైనా చేయాలని ఇలా ఉపవాసం ఉంటున్నాడట. మరొకటి ఏమిటంటే.., పెళ్ళయ్యాక నాని లావయ్యావ్ అని అంతా ఏడిపిస్తున్నారట. అందుకోసమే కాస్త సన్నబడాలి అని ఆ ఒక్కరోజు తిండి మానేస్తున్నాడట. ఒక్కరోజు భోజనం చేయకపోతే ఎంత తగ్గుతారో సరిగ్గా లెక్కలయితే తెలియవు. ఇప్పటివరకు చెప్పలేదు కదా.., నాని ఉపవాసం ఉంటున్నది అక్టోబర్ 11న.

భార్యపై కట్టలు తెంచుకున్న ప్రేమను చూపించటానికి కడుపు మాడ్చుకుంటున్నాడు బాగానే ఉంది. కాని ఇదే మీరు చేయండి అంటూ డైరెక్టర్లు కృష్ణవంశీ, రాజమౌళికి ఛాలెంజ్ చేశాడు. రోజంతా మీ భార్య కోసం మీరు ఒకరోజు ఖాళీ కడుపుతో ఉండగలరా అని సవాల్ చేస్తున్నాడు. భార్యపై కోపంతో కడుపు మాడ్చుకునే వారిని చాలామంది చూశాము కానీ.., ప్రేమతో పస్తులు ఉండేవారిని నానినే చూస్తున్నాము అనుకుంటున్నారంతా. ఎవరేమన్నా తన స్వీట్ హార్ట్ కోసం మస్ట్ ఫాస్ట్ అంటున్నాడు. చూడాలి మరి ఈ ఛాలెంజ్ కు సీనియర్ డైరెక్టర్లు ఎలా స్పందిస్తారో...?

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nani  fasting  rajamouli  krishna vamsi  

Other Articles