Dialogue king saikumar son and hero aadi engaged with aruna in hyderabad friday evening

saikumar son aadi, tollywood hero aadi, hero aadi, aadi engangement with aruna, hero aadi engaged aruna, saikumar aadi photos, tollywood news, aadi girlfriend aruna news, aadi with aruna, aadi marriage news

dialogue king saikumar son and hero aadi engaged with aruna in hyderabad friday evening

సైలెంట్ గా గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఆది!

Posted: 10/04/2014 03:48 PM IST
Dialogue king saikumar son and hero aadi engaged with aruna in hyderabad friday evening

‘‘ప్రేమకావాలి’’ లాంటి భారీ హిట్ సినిమాతోనే తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చుకున్న టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది కొద్దికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట్లో వరుసగా విజయాలు అందుకుంటూ మధ్యలో ఫ్లాప్ అయిన ఈ యంగ్ హీరో.. ‘‘గాలిపటం’’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ మీదకొచ్చి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. గతకొద్దిరోజుల నుంచి ఆది ఒక అమ్మాయితో ఫుల్లుగా ప్రేమలో మునిగిపోయాడని.. ఆమెతోనే పెళ్లి కూడా చేసుకుంటాడనే వార్తలు జోరుగా కొనసాగాయి. ఆది కూడా తనకు గర్ల్ ఫ్రెండ్ వున్నట్లు చెప్పాడు కూడా! కానీ ఆ అమ్మాయి వివరాలను మాత్రం పూర్తిగా బయటపెట్టలేదు. ఆమధ్య బీటెక్ చదువుతున్న అమ్మాయి అంటూ వార్తలొచ్చాయి కానీ.. అది నిజమో కాదో తెలియదు.

hero-aadi-engagement-news

ఇదిలావుండగా.. తాజాగా ఆది గుట్టుచప్పుడు కాకుండా తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఎంగేజ్ మెంట్ తాలూకా ఫోటోలు కూడా నెట్ లోహల్ చల్ చేస్తున్నాయి. అంటే.. ఇన్నాళ్లనుంచి తనపై వస్తున్న వార్తలను ఆది సైలైంట్ గానే తన ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేశాడన్నమాట! శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరుణ అనే అమ్మాయితో ఆది నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం! అయితే ఈ వేడుకకు ఇతర అతిథులు ఎక్కువ హాజరు కాలేదని.. వధువరుల కుటుంబసభ్యుల, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే జరిగిందని తెలుస్తోంది. పైగా ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్ గానే ఈ నిశ్చితార్థాన్ని ముగించేశారు. త్వరలోనే వివాహ వేడుకలు వుంటాయని ఆది సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. మరి ఈ పెళ్లి గ్రాండ్ గా చేస్తారా..? లేక ఇలాగే సైలైంట్ గా కానిచ్చేస్తారా..? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dialogue king saikumar  hero aadi  aadi engagement news  aadi aruna news  tollywood  

Other Articles