Purijagannath changes to the script for ntr movie

jr ntr, jr ntr movies, jr ntr latest, jr ntr wiki, ntr latest movies, ntr marriage, ntr fans, ntr balayya jokes, ntr comments, funny images, telugu funny images, telugu quotations, puri jagannath, puri jagannath movie, puri jagannath ntr movie, rabhasa, rabhasa movie free download, tollywood, latest news, vakkantham vamshi

director puri jagannath changed some scenes in script of ntr's upcoming movie : vakkantham vamshi script for jr ntr's upcoming movies is seems to have identical to a latest movies so ntr alerted puri jagnannath to change the script

ఎన్టీఆర్ సినిమా స్ర్కిప్టు మార్చేసిన పూరి

Posted: 09/24/2014 10:31 AM IST
Purijagannath changes to the script for ntr movie

ఎన్టీఆర్ రాబోయే సినిమా స్ర్కిప్టును డైరెక్టర్ పూరి మార్చేసినట్లు టాక్ వస్తోంది. పూరి జగన్నాధ్ తో కలిసి ఎన్టీఆర్ త్వరలోనే ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ పై చిన్న వివాదం చెలరేగినా.. నిర్మాత జోక్యంతో ఇద్దరూ సర్దుకుపోయారు. ప్రస్తుతం సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ మూవీ కధను వక్కంతం వంశీ అందిస్తున్నారు. అయితే వంశీ కధ విడుదలకు సిద్దంగా ఉన్న ఓ తెలుగు సినిమాను కాస్త పోలి ఉన్నట్లు గుసగుసలు వచ్చాయి. ఈ విషయం తారక్ కు కూడా తెలియటంతో ఆయన అప్రమత్తం అయ్యారు.

స్ర్కిప్టుపై వస్తున్న టాక్ ను పూరికి చెప్పి.. ఓ సారి చూడాలని కోరాడు. స్ర్కిప్టును పరిశీలించిన డైరెక్టర్, జూనియర్ విజ్ఞప్తితో పలు సీన్లను మార్చినట్లు తెలుస్తోంది. మిగతా మార్పుల కోసం వంశీకి సలహాలు కూడా ఇచ్చారట. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావటంతో అప్రతమత్తమైన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాస్ట్ కటింగ్ చేయటంతో పాటు.., ప్రతి విషయంలో అలర్ట్ గా ఉంటున్నాడు. ఈ సినిమా నుంచే ఎన్టీఆర్ కాస్ట్ కటింగ్ ప్రారంభం కానుంది.

ఇక పూరి జగన్నాధ్ ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ ఫెయిల్యూర్ ఇద్దరి కాంబినేషన్ మొదలు పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు పూరితో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి బండ్ల గణేష్ నిర్మాతగా ఉన్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 26నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని ఫిలింనగర్ టాక్. తెలుగు విశేష్ తరపున వీరి కాంబినేషన్ హిట్ కావాలని కోరుతూ.. ఆల్ ది బెస్ట్ టు పూరి తారక్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jr ntr  puri jagannath  latest news  tollywood  

Other Articles