Trisha demanding high remuneration for queen telugu remake movie and loses the offer

actress trisha latest news, actress trisha demands high remuneration for queen remake movie, trisha latest hot hoto shoot, trisha hot news, trisha movie news, trisha latest movie news, trisha in attarintiki daredi kannada movie remake, trisha with balakrishna, trisha bikini photo shoot

trisha demanding high remuneration for queen telugu remake movie and loses the offer

బంగారు గుడ్లు ఇస్తోంది కదాని కోడినే కోసేస్తే ఎలా త్రిష..?

Posted: 07/31/2014 04:53 PM IST
Trisha demanding high remuneration for queen telugu remake movie and loses the offer

(Image source from: trisha demanding high remuneration for queen telugu remake movie and loses the offer)

ప్రస్తుతం త్రిష వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తుంటే ఇలాగే అనుకోవాల్సి వస్తోంది. గత కొంతకాలం నుంచి ఒక్క సినిమా ఆఫర్ లేకుండా కాలం గడిపిన త్రిషకు... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది రీమేక్ సినిమాలో సుదీప్ సరసన నటించే ఆఫర్ వస్తే... ఏదో ఒకటి అనుకుని తిరస్కరించుకోలేక అందుకు ఓకే అని చెప్పేసింది. ఇదే క్రమంలో టాలీవుడ్ లో వున్న సీనియర్ హీరోలకు సరిజోడుగా కనిపించే హీరోయిన్ల కొరత వుండటం వల్ల.. ఆ స్థానంలో ఈమె ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి బాలకృష్ణ సరసన నటించే అవకాశం కూడా వచ్చేసింది.

ఇదిలావుండగా.. బాలీవుడ్ లో కంగనా రనౌత్ లీడ్ రోల్ లో నటించిన ‘‘క్వీన్’’ సినిమాను తెలుగులో రీమేక్ హక్కులను త్యాగరాజన్ తీసుకున్న విషయం తెలిసిందే! అయితే ఇందులో లీడ్ రోల్ ను ఎవరు తీసుకుంటే బాగుంటుందా అని భావించిన ఈయన... తమిళ, తెలుగు ఇండస్ట్రీలో వున్న చాలా కథానాయికలను సంప్రదించారు. తొలుత హన్సిక, ఛార్మి, సమంత, నయనతార వంటి తారల పేర్లెన్నో ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు గానీ.. త్యాగరాజన్ చివరకు త్రిష దగ్గరకు వచ్చి చేరుకున్నారు.

తాను తెలుగులో తీయబోతున్న క్వీన్ రీమేక్ సినిమాలో నటించాల్సిందిగా ఆమెను త్యాగరాజన్ కోరగా.. అందుకు ఆమె దిమ్మతిరిగిపోయేలా సమాధానం ఇవ్వడం వల్ల అక్కడి నుంచి రివర్స్ గేర్ వేసుకుని వెనక్కు వచ్చేశాడాయన! ఏదో సినిమాలు లేక ఖాళీగా వుంది కదా అని ఒక మంచి కథతో ఈ అమ్మడి దగ్గరకు వస్తే.. ఏకంగా 1 కోటి 25 లక్షల వరకు రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి ఆ ప్రాజెక్ట్ ను తన చేతులారా చేజార్చుకుంది. కోడి గుడ్లు ఇస్తోంది కదా.. దానిని కోస్తే అందులో ఎంత బంగారం వుంటుందోనని అత్యాశకు పోయి కోసేస్తే.. అందులో మిగిలేది రక్తమేనని త్రిషకు తెలిసినట్లు లేదేమో!

ప్రస్తుతం త్రిష వున్న పరిస్థితిని గమనిస్తే.. త్యాగరాజన్ ఈమె దగ్గరకు ఆఫర్ తీసుకురావడమే గొప్ప. క్వీన్ సినిమా బాలీవుడ్ లో ఎటువంటి సంచలనం విజయం సాధించిందో అందిరికీ తెలిసిందే! అందులో మెయిన్ లీడ్ రోల్ లో వున్న కథానాయికదే ప్రధాన పాత్ర! ఆ సినిమాలో నటించిన కంగనా రనౌత్ దశ కూడా బాలీవుడ్ లో పూర్తిగా మారిపోయింది. అలాంటి కథలో మెయిల్ లీడ్ లో నటించే అవకాశం రావడం గొప్ప. అలా కాకుండా ఈ అమ్మడు భారీ పారితోషికం డిమాండ్ చేసి పట్టువదలకుండా వుంటే.. ఎంతవరకు సబబు అంటూ సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles