Pawan kalyan completed his first day shooting of gopala gopala movie

pawan kalyan completed his first day shooting of gopala gopala movie, pawan kalyan latest news, pawan kalyan in gopala gopala movie, gopala gopala movie news, gopala gopala movie photos, pawan kalyan with venkatesh in gopala gopala movie, pawan kalyan as modern krishna in gopala gopala movie, gopala gopala movie schedules

pawan kalyan completed his first day shooting of gopala gopala movie

సెట్ లో ‘‘మోడ్రన్ కృష్ణుడు’’గా లీలలు చేస్తున్న పవన్!

Posted: 07/22/2014 01:10 PM IST
Pawan kalyan completed his first day shooting of gopala gopala movie

(Image source from: pawan kalyan completed his first day shooting of gopala gopala movie)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి తాజాగా తీస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘‘గోపాల గోపాల’’! ఈ సినిమాకు సంబంధించి వెంకటేష్ మీద గతంలోనే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కల్యాణ్ కూడా సోమవారం నుంచి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హిందీలో భారీ విజయాన్ని మూటగట్టుకున్న ‘‘ఓ మై గాడ్’’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మోడ్రన్ కృష్ణుడిగా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడని యూనిట్ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న పవన్ కల్యాణ్... సెట్ లో దూకుడుగా ప్రవర్తిస్తున్నాడని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. సెట్ కు వచ్చిన మొదటిరోజులోనే దాదాపు 4 నుంచి 5 సన్నివేశాలను పవన్ పూర్తి చేసుకున్నాడని వారు వెల్లడిస్తున్నారు. పవన్ ఈ విధంగా తన వేగాన్ని ప్రదర్శించడం చూసి వెంకటేష్ కూడా షాక్ తిన్నాడని వారు చెప్పుకుంటున్నాడు. స్ర్కిప్టుని ఇంతకుముందే బాగా చదువుకోవడం కారణం వల్లే పవన్ తన స్పీడుని పెంచేశాడంటూ ఫిల్మ్ నగర్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

పైగా పవన్ కల్యాణ్ ఈ సినిమా కేటాయించిన కాల్షీట్లు కూడా చాలా తక్కువ రోజులు కావడం వల్ల పవన్ ఆ సమయాన్ని వృథా చేసుకోకుండా త్వరగా తన సన్నివేశాలను పూర్తి చేసుకోవడానికి అన్నిరకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఎంతటి పెద్ద హీరో అయిన సెట్ లోకి ఎంట్రీ అయిన వెంటనే అక్కడి వాతావరణాన్ని, సభ్యులను అర్థం చేసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కానీ పవన్ కల్యాణ్ ప్రదర్శిస్తున్న దూకుడు మాత్రం అలా లేదని వారు చెబుతున్నారు. ఈ సినిమాను కిషోర్ పార్థసాని దర్శకత్వం వహిస్తుండగా... సురేష్ బాబు, శరత్ మరార్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles