Pawan kalyan gopala gopala movie postponed

pawan kalyan in gopala gopala movie, Pawan kalyan gopala gopala movie release pushed to sankranthi festival, pawan kalyan latest news, pawan kalyan with venkatesh, pawan kalyan news, pawan kalyan gopala gopala movie, pawan kalyan and venkatesh in gopala gopala movie, gopala gopala movie latest news, pawan kalyan as modern krishna in gopala gopala movie, gopala gopala movie opening photos

Pawan kalyan gopala gopala movie release pushed to sankranthi festival

అభిమానులను నిరాశ పరిచిన పవన్ కల్యాణ్!

Posted: 07/21/2014 11:03 AM IST
Pawan kalyan gopala gopala movie postponed

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీని స్థాపించి బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతుగా ప్రచారాలు చేసిన పవన్ కల్యాణ్... ఆనాడు ఆ ప్రచారాలతో బిజీగా వుండటం వల్ల సినిమాల నుంచి తప్పుకున్నాడు. అయితే ఎన్నికల అనంతరం తిరిగి సినిమాల్లో ప్రవేశిస్తున్నానని పవన్ స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత ఆయన అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. తన అభిమాన నటుడి సినిమా చాలా త్వరలోనే తెరమీదకు రాబోతోందని అందరూ పండుగ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ‘‘గబ్బర్ సింగ్ 2’’, వెంకీతో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ‘‘గోపాల గోపాల’’ చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. ఇందులో ‘‘గోపాల గోపాల’’ చిత్రం అక్టోబర్ లోనే రిలీజ్ అవుతుందని అప్పట్లో దర్శకనిర్మాతలు వెల్లడించారు. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ‘‘గోపాల గోపాల’’ సినిమాకోసం సంక్రాంతి వరకు ఆగాల్సిందేనని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నారు. మొదట్లో అక్టోబర్ లోనే రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను తాజాగా జరిగిన కొన్ని మార్పుల వల్ల వచ్చే ఏడాది సంక్రాంతి పండుగనాడు రిలీజ్ చేయనున్నట్టు వారు స్పష్టం చేశారు. ఈ చిత్రం షూటింగ్ లో వెంకీ ముందుగానే జాయిన్ అవ్వగా... సోమవారం(నేడు) నుంచి పవన్ కల్యాణ్ తనిచ్చిన డేట్స్ ప్రకారం 20రోజుల వరకు కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

హిందీలో విడుదలై 100 కోట్ల క్లబ్ లో చేరిన ‘‘ఓ మై గాడ్’’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మోడ్రన్ కృష్ణుడి అవతారంలో సరికొత్తగా కనిపించబోతున్నాడు. వెంకటేష్, పవన్ కల్యాణ్ లు ఈ సినిమాలో తమ అద్భుత నటనతో ప్రేక్షకులను బాగా అలరిస్తారని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సినిమా కోసం అభిమానులకు మాత్రం ‘‘సంక్రాంతి’’ వరకు ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles