Amir khan villain role in robo 2 movie

Amir khan to act villain role rajnikanth in robo sequel movie, amir khan latest news, amir khan with rajnikanth, amir khan villain role in robo 2 movie, rajnikanth latest news, rajnikanth with director shankar, rajnikanth in robo movie, rajnikanth with amir khan, amir khan and rajnikanth in robo 2 movie, robo 2 movie latest news, robo 2 movie news, amir khan villain role in robo 2 movie

Amir khan to act villain role opposite to superstar rajnikanth in robo sequel movie

సూపర్ స్టార్ కోసం విలన్ గా మారుతున్న మిస్టర్ పర్ ఫెక్ట్

Posted: 07/18/2014 11:59 AM IST
Amir khan villain role in robo 2 movie

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కలయికలో వచ్చిన ‘‘రోబో’’ సినిమా యావత్తు ప్రపంచవ్యాప్తంగా రిలీజయి ఎన్నో రికార్డులను సృష్టించింది. సౌత్ ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి సినిమాగా పేరుపొందింది. అటు జపాన్ లోనూ రజనీ అభిమానులు ఎక్కువగా వుండటం వల్ల... అక్కడ కూడా కలెక్షన్ల సునామీని సృష్టించగలిగింది ఈ సినిమా. ఈ సినిమాలో రజనీకాంత్ హీరో, విలన్ గా రెండు పాత్రలను పోషించాడు. ఈ సినిమాతోనే భారతీయ చిత్రపరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని, అంతర్జాతీయ స్థాయిలో గర్వించదగ్గ సినిమా అని కొంతమంది ముఖ్యులు కూడా కితాబిచ్చారు.

ప్రస్తుతం దర్శకుడు శంకర్ ‘‘రోబో’’ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతీ తెలిసిందే! తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు వెలువడ్డాయి. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అయిన ఆమీర్ ఖాన్ ఈ రోబో సీక్వెల్ చిత్రంలో విలన్ గా నటిస్తున్నట్టు కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇందులో హీరోగా రజనీకాంత్ నటిస్తుండగా.. విలన్ పాత్రకు ఒక ప్రముఖ నటుడిని తీసుకోవాలని దర్శకుడు నిర్ణయించుకున్నాడట! ఈ క్రమంలోనే ఆయన ఆమీర్ ఖాన్ ను సంప్రదించగా.. అందుకు ఆయన ఓకే అని చెప్పాశాడని కోలీవుడ్ కోడై కూస్తోంది.

ఒకవైపు సౌత్ సూపర్ స్టార్, మరోవైపు ధూమ్-3 సినిమాలో బాలీవుడ్ లో సరికొత్త రికార్డులన సృష్టించిన ఆమీర్ ఖాన్ లాంటి స్టార్ల కలయికతో రానున్న ఈ చిత్రం... భారత చిత్రపరిశ్రమలోనే సంచలన విజయాన్ని సాధిస్తుందని అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించునున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హింధీ భాషల్లో నిర్మించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles