టాలీవుడ్ ప్రిన్స్ మహేస్ బాబు తన వాళ్ళ కోసం ఏదైనా చేసి, పక్కన వాళ్ళను హర్ట్ చేసే క్యారెక్టరా ? అనే సందేహం కలుగుతుంది ఆయన తీరు చూస్తుంటే. మహేష్ బాబు కెరియర్ కి టర్నింగ్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్. ఆయన దర్శకత్వం వహించిన ‘ఒక్కడు ’ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా, జాతీయ అవార్డులు కూడా అందుకుంది.
అలా కెరియర్ కి టర్నింగ్ ఇచ్చిన గుణశేఖర్ మహేశ్ తో ఉన్న సాన్నిహిత్యంతో ప్రస్తుతం తీస్తున్న హిస్టారికల్ సినిమా ‘రుద్రమదేవి ’ ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను చేయమని అడిగితే ఏదో సాకులు చెప్పి చేయనని చెప్పాడు. దీంతో గుణశేఖర్ బాగా హర్ట్ అయ్యి, స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్ ’ తో ఆ పాత్ర చేయించుకుంటున్నాడు. కానీ మహేశ్ తన బావ సుదీర్ బాబు కన్నడలో వచ్చిన చార్మినార్ సినిమాకి రీమేక్ గా ‘కృష్ణమ్మ పిలిచింది ఇద్దరినీ ’ పేరుతో సినిమా చేస్తున్నాడు.
అందులో గెస్ట్ పాత్ర చేయమని అడిగితే వెంటనే ఒప్పుకోవడమే కాకుండా, ఎటువంటి పారితోషికం తీసుకొను అంటూ ఆ సినిమా నిర్మాతకి మరో తీపి కబురు చెప్పాడట. దాంతో సినిమాకు సంబందించిన పారితోషికం ఖర్చు చాలా వరకు తగ్గినట్లే అని నిర్మాత సంబంర పడుతున్నాడు. ఈ సినిమాకి కన్నడ వర్షన్ కు దర్శకత్వం వహించిన చందూ నే ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మహేశ్ తీసుకున్న ఈ నిర్ణయంతో సినీ జనాలు మాత్రం మహేశ్ తన వాళ్ల కోసం ఏదైనా చేస్తాడని అనుకుంటున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more