Chitrangda singh finally divorced her husband

Chitrangda Singh divorce,Sudhir Mishra,Jyoti Randhawa,ChitrangadaSingh, Chitrangada, Chitrangada Singh,Chitrangda Singh,Chitrangda Singh divorce,Jyoti Singh Randhawa

Bollywood actress Chitrangada Singh has been officially granted divorce from golfer husband Jyoti Randhawa by a Gurgaon family court.

చిత్రాంగద పెళ్లి పెటాకులు అయ్యాయి

Posted: 04/18/2014 10:55 AM IST
Chitrangda singh finally divorced her husband

సినిమా వాళ్లు పట్టుమని పది కాలాల పాటు కలిసి ఉండలేరు పెళ్లిళ్ళు చేసుకొని కొన్నాళ్ళు కాపురాలు చేసిన తరువాత వీరికి బోర్ కొట్టి కొత్త రుచులను ఆస్వాదించాలని అనిపిస్తుందో లేక, సెలబ్రెటీలమనే ఫీలింగ్ లో ఇగో అడ్డం వస్తుందో తెలియదు కానీ... తమకు విడాకులు కావాలని కోర్టులకు ఎక్కేస్తారు.

ఇక్కడ అదే పని చేసింది బాలీవుడ్ బ్యూటీ చిత్రాంగద. గత పదమూడేళ్ల క్రితం గోల్ఫ్ ఆటగాడు జ్యోతిసింగ్ రంద్వాను పెళ్ళి చేసుకున్న వీరిద్దరి వివాహ బంధంలో సమస్యలు తెలెత్తడంతో విడాకులు కావాలని, తామిద్దరం ఇష్ట పూర్వకంగా విడిపోయాలని నిర్ణయించుకొని గత ఏడాది గుర్గావ్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు. 

వారి ఇద్దరు విడిపోయేందుకు కోర్టు అంగీకరిస్తూ విడాకులు మంజూరు చేసింది. వారిద్దరి దాంపత్య జీవితానికి కానుకగా జన్మించిన కొడుకు జోరావర్ ను తల్లి చిత్రాంగదకే అప్పగించారు. పెళ్ళయి ఓ కొడుక్కి తల్లి అయినా తనలో ఏ మాత్రం అందాలు తగ్గకుండా మెయింటేన్ చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల్లో, ఐటెం సాంగుల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇటీవలే తమిళంలో సూర్య నటిస్తున్న సినిమాలో ఓ ఐటెం సాంగులో తన అందాలతో పిచ్చెక్కించిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles