గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి. ముందు ప్రకటించిన విడుదల తేదీ ప్రకారం ఏ సినిమా విడుదల కావడం లేదు. కారణం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు... పండగ సీజన్లలో విడుదల చేసి పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవాలనే దర్శక నిర్మాతల ఆలోచన కావచ్చు కానీ సినిమాలను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే రానున్న సంక్రాంతికి సీజన్ ని చొటా బడా సినిమాలు టార్గెట్ చేశాయి. ఈ సీజన్ లో సినిమాలను విడుదల చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతిని సెంటిమెంటుగా భావించే మహేష్ ‘1’ సినిమాను జనవరి 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా. నితిన్ ‘హార్ట్ ఎటాక్ ’ సాయి ధర్మతేజ్ ‘రేయ్ ’ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలపాలని ట్రై చేస్తున్నారు. ఇఫ్పటికే పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చిన మెగా హీరో చరణ్ సినిమా ‘ఎవడు ’ ను నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నాడు. అదే కాకుండా అల్లు అర్జున్ సినిమా ‘రేసు గుర్రాన్ని ’ కూడా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని వార్తలు జోరుగా వచ్చాయి.
ఇప్పటికే 50 శాతం షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పడు సంక్రాంతి ‘రేసు ’లో వుండదనే టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ వర్గాల నుండి. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా సంక్రాంతి రేసులో ఉండటంతో థియేటర్లు దొరకడం కష్టం అవుతుందనే విషయాన్ని కొంతమంది డిస్టిబ్యూటర్లు నిర్మాతకు చెప్పడంతో ఆయన ‘రేసుగుర్రాన్ని ’ ఈ పోటీ నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగానే వున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందు తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more