Pawan cgtr title disign changed

pawan cgtr title disign changed puri jagannath movie

pawan cgtr title disign changed

15.gif

Posted: 08/30/2012 09:18 PM IST
Pawan cgtr title disign changed

'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమా టైటిల్ లోగోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. టైటిల్ చాలా పోడవైపోయిందనే కామెంట్లు వచ్చినా, పూరీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అనుకోని విధంగా ఈ సినిమా టైటిల్ లోగో డిజైన్ మారిపోయింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పవన్ కల్యాణ్ స్టిల్స్ నేడు బయటకు వచ్చాయి. వాటిలో ఉన్న టైటిల్

Cameramen_-title

లోగో పూర్తిగా మారిపోయి కనిపిస్తోంది. సినిమా విడుదల దగ్గరపడుతుండగా ఈ సినిమా టైటిల్ లోగో మారిపోవడం గురించి ఆరాతీస్తే ... ఇంతకు ముందున్న లోగో పవన్ కల్యాణ్ కి నచ్చక పోవడంవల్ల కొత్త లోగోను డిజైన్ చేయడం జరిగిందని తెలుస్తోంది.  ఈ కొత్త లోగోలో 'కెమెరామెన్ గంగతో' అనే వాక్యం వరకూ సైజును తగ్గించి 'రాంబాబు' అనే పేరును మాత్రమే హైలైట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల టైటిల్లోనే హీరోయిజం స్పష్టంగా కనిపిస్తోందనీ ... ఆ ఉద్దేశంతోనే పవన్ ఇలా మార్పు చేశాడని అంటున్నారు.
    అయితే.. 'దేవుడు చేసిన మనుషులు' ఫ్లాప్ పై  పొడవైన టైటిల్ ప్రభావం ఉందని నమ్మిన కారణంగానే పవన్ 'రాంబాబు' అనే పేరును మాత్రమే హైలైట్ చేశాడని మరి కొందరు అంటున్నారు. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malli verses raviteja new movie
Vidyabalan saary five crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles