Amisha patel birthday today

amisha patel birthday today

amisha patel birthday today

1.4.gif

Posted: 06/10/2012 07:20 PM IST
Amisha patel birthday today

      కైపెక్కించే కళ్ళు.. కవ్వించే పెదాలు.. చూపు తిప్పుకోనివ్వని రూపం.. ఇవన్నీ కలగలిసిన రూపం అమీషా పటేల్. ఈ భామ బాలీవుడ్ వారికే కాదు టాలీవుడ్ వారికీ పరిచయమే. తెలుగులో ఫస్ట్ టైమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన  బద్రిలో నటించింది. 11eeటాలీవుడ్ లో ఫస్ట్ మూవీ హిట్‌ అవ్వడంతో ఈ భామకు  ఇక్కడ  మంచి క్రేజీ ఏర్పడింది. యంగ్ హీరోలు ఈ భామతో చేసేందుకు ముచ్చటపడ్డారు.  ఎన్టీఆర్‌ సరసన నరసింహుడు చిత్రంలో,  మహేష్‌బాబు సరసన నానిలో నటించింది. అయితే ఈ సినిమాలు అమీషాను తెలుగు స్ర్కీన్‌పై నిలబెట్టలేకపోయాయి. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ బాట పట్టిన అమీషా.. అక్కడ వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే అక్కడ అనుకున్నంత ఫోకస్ కాలేకపోయింది. ‘గదర్‌.. ఏక్‌ ప్రేమ్‌ కహాని, కహో నా ప్యార్‌ హై’ వంటి సూపర్‌హిట్స్‌లో నటించిన అమీషాకు  చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటీ లేదు. గత కొన్నేళ్లుగా హిట్స్ లేక ఫే డౌట్ స్టేజ్ కు చేరుకున్న అమీషా... ఈ సారి ఎలాగైనా మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలని పట్టుదలతో ఉంది. పన్నెండేళ్ల క్రితం ఆమె నటించిన తొలి సినిమా కహో నా ప్యార్ హే... హృతిక్ తో పాటు అమీషాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత రెండు మూడు సినిమాలు మినహా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలేవీ తాజాగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ రేస్-2లో బంపర్ ఆఫర్ దక్కించుకుంది అమీషా. మరో రెండు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంది. మొత్తానికి పన్నేండేళ్ళ కాలంలో ఈ కొత్త సినిమాలు తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతున్నాయని భారీ భరోసాతో ఉంది ఈ భామ. మరి ఈ బర్త్ డే భామ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. అమీషా బర్త్ డే  ఇవాళ ఘనంగా జరుపుకుంది. నేటితో ముఫ్పై ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అమీషా కెరీర్ కలర్ ఫుల్ గా ఉండాలని ఆంధ్రావిశేష్.కాం ఆకాంక్షిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balayya babu birthday wishesh
Shilpa infant son named viaan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles