Director harish shankar message to ntr fans

Harish,Shankar,Message,To,NTR,Fans

Harish Shankar has become hot property in Telugu film industry after the success of 'Gabbar Singh'

Harish Shankar Message To NTR Fans.gif

Posted: 06/08/2012 02:50 PM IST
Director harish shankar message to ntr fans

Harish-shankar

పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకునే హరీశ్ శంకర్ ఆయనతో ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ కి పూర్వ వైభవంతో పాటు హరీష్ స్టార్ డమ్ బాగా పెరిగి పోయింది. దీంతో నిర్మాతలు అతనికి కోట్లు ఇస్తామంటూ క్యూ కడుతున్నారు. కానీ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత సినిమా ఎన్టీఆర్ తో చేస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే తన తదుపరి సినిమాకి సన్నాహాలు ప్రారంభించాడు. ఇంత వరకు బాగానే ఉన్నా... ఎన్టీఆర్ అభిమానులు మాత్రం హరీష్ శంకర్ ని నమ్మడం లేదట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కాబట్టి అతన్ని సినిమాలో బాగా చూపించి, అతనికి తగ్గట్లు తీశాడు. పవన్ అభిమాని అయిన హరీష్ తమ అభిమాన నటుడి సినిమా ఎంతవరకు క్వాలిటీతో ఇవ్వగలడన్నదే యన్టీఆర్ అభిమానుల సందేహం.

గతంలో కూడా ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ హిట్ సినిమా ఇస్తే ఆ సినిమా డైరెక్టర్ ని నమ్మి తన తదుపరి ప్రాజెక్టు చేశాడు. కానీ వారు ఎన్టీఆర్ ఇమేజ్ తగిన హిట్ ఇవ్వలేదు. తాజాగా ‘సింహా’ తీసిన బోయపాటి శీను నమ్మి ‘దమ్ము’ సినిమా చేస్తే అది బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పడు అతని అభిమానులు ఇతని మీద సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి హరీష్ శంకర్ అభిమానుల సందేహం తీరుస్తాడో లేదో చూడాలంటే... సినిమా విడుదల వరకు ఆగాల్పిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh 50 days function in vizag
Prakash raj to direct aamir khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles