Oppo R11 Selfie-Focused Smartphone Launched ఒప్పో నుంచి కొత్త సెల్పీ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..

Oppo r11 is official with snapdragon 660 and 4gb of ram

oppo r11 price specifications, oppo r11 release date, oppo r11 features, oppo r11 selfie dual camera setup, oppo r11 android nougat, oppo r11 launch, oppo r11 specifications, oppo r11 features, oppo r11 price, oppo r11 mobiles, oppo, android

Oppo R11 has finally become official. The smartphone’s big highlights are its dual camera setup, Android 7.1 Nougat, and its 20-megapixel selfie camera.

ఒప్పో నుంచి కొత్త సెల్పీ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..

Posted: 06/06/2017 07:34 PM IST
Oppo r11 is official with snapdragon 660 and 4gb of ram

సెల్పీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మరో కొత్త సెల్పీ పోకస్డ్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చేందుకు కొంత సమయం తీసుకోవడంతో ఇప్పటికే పలు లీకేజీలు మార్కెట్లోకి విడుదలై స్మార్ట్ ఫోన్ ప్రియుల హృదయాలను కొల్లగోట్టింది. దీంతో ఇక ఏమాత్రం అలస్యం చేయని ఒప్పో అర్ 11 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో అతిపెద్ద ఆకర్షణ. వెనుకవైపు రెండు కెమెరాలు ఉండటంతో పాటు, ముందు వైపు సెల్పీల కోసం ప్రత్యేకంగా 20 మెగాపిక్సెల్ కెమెరాను పొందుపర్చారు.

జూన్ 10 నుంచి ఒప్పో ఆర్11 స్మార్ట్ ఫోన్ చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ చెప్పింది. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పటికీ, ఇంకా అధికారిక ధరను కంపెనీ ప్రకటించలేదు. మార్కెట్లో వస్తున్న రూమర్ల ప్రకారం ఈ ఫోన్ ధర 485 డాలర్లు ఉండొచ్చని అంటే రూ.31,200గా పేర్కొంటున్నాయి. మూడు రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ వేరియంట్లలో ఇది మార్కెట్లో లభ్యమవుతోంది. వెనుకవైపు అమర్చిన కెమెరా దగ్గర్నే సెంటర్ లో ఒప్పో లోగో ఉంటుంది.

ఒప్పో ఫోన్ అర్ 11 ప్రత్యేకతలు:-

 5.5 అంగుళాల డిస్ ప్లే,
స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్
4జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
ఒకటి 20 మెగాపిక్సెల్, మరొకిటి 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు
20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ 7.1 నోగట్
2900ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ ఎల్టీఈ, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oppo R11  Dual Camera  Android 7.1 Nougat  technology  

Other Articles