ఎల్జీ నుంచి వినూత్న అకర్షణలతో సరికోత్త స్మార్ట్ ఫోన్ LG V20 launched in India

Lg launches flagship v20 with dual display in india

lg, lg v20, lg v20 dual display, lg v20 now available in india, lg v20 vs galaxy s7 edge, lg v20 vs google pixel xl, lg v20 vs iphone 7 plus, lg v20 vs oneplus 3t, lg smartphones, lg v20 first impressions, lg v20 hands on, lg v20 android nougat, lg v20 snapdragon 820, technology, technology news

LG has moved on and is betting on the success of V20, its second flagship smartphone of 2016. The dual-screen V20 is a follow-up to the V10

ఎల్జీ నుంచి వినూత్న అకర్షణలతో సరికోత్త స్మార్ట్ ఫోన్

Posted: 12/06/2016 06:19 PM IST
Lg launches flagship v20 with dual display in india

స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టినా.. అశించిన మేరకు రాణించలేకపోతున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్.. స్మార్ట్ ఫోన్ ప్రియులను అకర్షించేందుకు సరికొత్త ఉత్పాదకతను సిద్దం చేసుకుని భారతీయ విఫణిలోకి అడుగుపెట్టింది. ఈ ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్ తరహాలో డ్యూయల్ స్ర్కీన్ లు వున్నాయి. ఇవాళే భారత మార్కెట్లోకి 'వీ 20' పేరిట విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్లో రెండు స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణ కాగా, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసేలా తయారైన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే..

ఇవాళ్లి నుంచి ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ లో అమ్మకాలు ప్రారంభం కాగా, ఈ ఫోన్ ధర రూ. 54,999గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ గా రూ. 18 వేల విలువైన బీఅండ్ఓ ప్లే హెడ్ సెట్ తో పాటు రూ.20 వేల వరకూ ఖచ్చితమైన బహుమతులు అందుకోవచ్చని అమెజాన్ సంస్థ కూడా ఆపర్లను ప్రకటించింది.

ఇందులో డ్యూయల్ రేర్ కెమెరా, 32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్, హెడ్ డీ ఆడియో రికార్డర్ వంటి సదుపాయాలున్నాయి. 2 టెరాబైట్ల వరకూ మెమొరీని పెంచుకునే సామర్థ్యం ఉంటుంది. 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 5.7 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే, 4 జీబీ రామ్, 16/8 ఎంపీ వెనుక కెమెరాలు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3200 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఫోన్ 4జీ వీఓఎల్టీఈ, వైఫై- జీపీఎస్, బ్లూటూత్ సదుపాయాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lg v20  dual display  indian market  v20 launched  amazon  technology  business  

Other Articles