Sirin Labs' Solarin is today's most ridiculous $16000 Android phone

Sirin labs launches ultra secure ultra expensive solarin smartphone

mobiles, sirin labs, sirin solarin, sirin solarin price, sirin solarin specifications, smartphones, costly smartphone Solarin

Privacy has been lately a topic of concern in smartphone industry and there have been brands trying to leverage this threat.

అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఇదే.. ఖరీదు ఎంతో తెలుసా..?

Posted: 06/01/2016 06:53 PM IST
Sirin labs launches ultra secure ultra expensive solarin smartphone

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఇజ్రాయెల్ స్టార్టప్ కంపెనీ సిరిన్ ల్యాబ్స్ మంగళవారం నాడు లండన్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. సైనిక స్థాయి భద్రతా వ్యవస్థ కలిగిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఖరీదు అక్షరాల 14వేల డాలర్లు (9.3 లక్షల రూపాయలు). రోల్స్ రాయిస్ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణిస్తున్న ఈ ఫోన్‌కు ‘సోలారిన్’ అని పేరు పెట్టారు. మొబైల్ ఫోన్ ద్వారా విస్తృత వ్యాపార లావాదేవీలను నిర్వహించే అంతర్జాతీయ వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

అత్యాధునిక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ కలిగిన దీనికి 23.8 మెగాపిక్సల్ రియర్ కెమేరా, 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌ఈడీ 2కే రెసల్యూషన్ తెర కలిగి ఉంది. సుపీరియర్ వైఫై కనెక్టివిటీ సౌకర్యం కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ వెనకాలున్న బటన్‌ను భౌతికంగా నొక్కడం ద్వారానే ఫోన్ యాక్టివేట్ అవుతుంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఫోన్‌లో లేని ప్రైవసీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని, ఈ విషయంలో ప్రముఖ కమ్యూనికేషన్ సెక్యూరిటీ సంస్థ ‘కూల్ స్పాన్’ సహకారం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

సైబర్ దాడులు నిత్యకృత్యం అయిన నేటి పరిస్థితుల్లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫోన్‌ను తయారు చేశామని కంపెనీ వర్గాలు తెలిపాయి. లండన్‌లోని మేఫేర్ భవనం షోరూమ్‌లో ఈ రోజు నుంచి ఈ ఖరీదైన ఫోన్ అమ్మకాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ఫోన్ ‘వర్చూ టీఐ’ దాని ధర మార్కెట్లో 6,40,990 రూపాయలు. మొదట నోకియా కంపెనీతో కలసి బ్రాండ్ మేకర్ వర్చూ ఈ ఫోన్‌ను తీసుకరావాలనుకొంది. ఆ తర్వాత మార్కెట్ టర్మ్స్ కుదరక నోకియాతో విడిపోయి సొంతంగానే ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : costly smartphone Solarin  Sirin Labs  

Other Articles