Indian it sector to touch rs 175 lakh cr by 2016

India Information Technology , Indian IT sector, Rs 1.75 lakh cr by 2016,

India Information Technology industry is expected to touch the Rs 1.75 lakh crore mark by 2016, helped by rise in IT services and software segments, a report by Boston Consulting Group

Indian IT sector.png

Posted: 03/20/2013 01:39 PM IST
Indian it sector to touch rs 175 lakh cr by 2016

IT-sector

భారత ఐటీ పరిశ్రమ 2016 నాటికి రూ.1.75 లక్షల కోట్లకు పెరుగుతుందని సీఐఐ-బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీఎస్‌జీ) నివేదిక వెల్లడించింది. ఐటీ సర్వీసులు, సాఫ్ట్‌వేర్ సెగ్మెంట్లలో వృద్ధే దీనికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. 2011లో రూ.99,700 కోట్లుగా ఉన్న ఐటీ పరిశ్రమ నాలుగేళ్లలో 12 శాతం చొప్పున వృద్ధి సాధిస్తూ రూ.1.75 లక్షల కోట్లకు చేరుతుందని వివరించింది.

2016 కల్లా ఐటీ సర్వీసుల రంగం 14% వృద్ధితో రూ.96,600 కోట్లకు, హార్డ్‌వేర్ రంగం 6% వృద్ధి చొప్పున రూ.44,400 కోట్లకు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల సెగ్మెంట్ 14% వృద్ధితో రూ.34,400 కోట్లకు చేరతాయని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ పరిశ్రమ 10 వేల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనాలున్నాయని ఈ నివేదికను విడుదల చేస్తూ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు. ఇది జీడీపీలో 7.5 శాతమన్నారు. భారత అధిక వృద్ధి సాధనకు ఐటీ ఇతోధికంగా తోడ్పడుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ ఎస్. గోపాలకృష్ణన్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gv prasad appointed ceo of dr reddys
Icici hdfc bank axis probing money laundering accusations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles