nehar nala an olden engineering expertise proof పురాతన ఇంజినీరింగ్‌ అద్భుతానికి సాక్ష్యం ‘నెహర్‌ నాలా’

Nehar nala an olden engineering expertise proof

nehar nala, durgam tank, durgam cheruvu, gravitaional force, water to top floors, no pipes, no motors, no power, canal, olden days engineers, engineering expertise

nehar nala is the proof of olden days engineering where water from durgam cheruvu was taken to the top floors of nizam raj mahal only with grvitational force.

పురాతన ఇంజినీరింగ్‌ అద్భుతానికి సాక్ష్యం ‘నెహర్‌ నాలా’

Posted: 10/28/2017 07:18 PM IST
Nehar nala an olden engineering expertise proof

గోల్కొండ కోట పరిధిలోని రాజప్రసాదం, ఉన్నతాధికారులు, సహాయక సిబ్బంది, కోటలో నివాసం ఉండేవారికి స్థానికంగా ఉన్న బావుల్లోని నీరు సరిపోయేది కాదు. కుత్‌బ్‌షాహీ పాలకుల ఆదేశంతో అప్పటి ఇంజినీర్లు చుట్టుపక్కల నీటి వనరుల్ని అన్వేషించారు. రహస్య చెరువుగా పేరొందిన దుర్గం చెరువును గుర్తించారు. కొండల నుంచి వచ్చే నీరు చిన్న కట్టతో అక్కడి నిలుస్తుండగా..దాన్ని అభివృద్ధి చేశారు. దక్షిణం వైపున్న కట్ట ఎత్తు పెంచడంతోపాటు..ఎక్కువ నీరు నిల్వచేసినా తట్టుకునేలా దృఢంగా మార్చారు. నీటి విడుదల, నియంత్రణకు తూములు ఏర్పాటుచేశారు. చెరువు నుంచి కోట వరకు కాలువ తవ్వి నీటి సరఫరాకు మార్గం సుగమం చేశారు.

భూగర్భంలో.. ఆ తర్వాత 15, 20 అడుగుల ఎత్తులో: ఇందులో భాగంగా దుర్గం చెరువు తూముల నుంచి కొంతదూరం వరకు భూగర్భ మార్గంలో నీటిని మళ్లించారు. ఖాజాగూడ ప్రాంతంలో నెహర్‌ నాలాను పైకి లేపారు. స్తంభాలపై వెడల్పయిన గోడలు నిర్మించి, వాటి మధ్య కాలువలో నీళ్లు పారేలా చేశారు. ప్రాంతాన్ని బట్టి 5, 10, 20 అడుగుల ఎత్తున వాటిని అనేక ప్రాంతాల్లో నిర్మించారు. దుర్గం చెరువు నుంచి గోల్కొండ కోట వరకు దాదాపు నాలుగు కి.మీ. దూరం ఉన్న ఈ నీటి సరఫరా వ్యవస్థ ‘నెహర్‌ నాలా’ (నిరంతరం ప్రవహించే కాలువ)గా గుర్తింపు పొందింది.

దాని ద్వారా గోల్కొండ కోటలోని రెండు అంతస్తుల్లోకి నీళ్లు అవలీలగా వెళ్లేవి. రాజప్రసాదాలు, ఉద్యానవనాలు, ఈత కొలనులకు..ఒకటేమిటి కోటలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేది. ఫౌంటెన్‌లో ఎగిసిపడే నీటి చప్పుడు...కోట కింది మార్గంలో వినపడే ఏర్పాట్లూ జరిగాయి. ‘నేటి ఇంజినీర్లు కూడా ఆశ్చర్యపోయేలా దుర్గంచెరువు నుంచి గోల్కొండ కోటకు నీటిసరఫరా జరిగింది. ప్రస్తుతం ఈ నాలా కాలగర్భంలో కలిసింది. దాని మార్గంలో నివాసాలు ఏర్పాడ్డాయి.

దర్గా ప్రాంతంలో మాత్రమే కొంతమేరకు దాని ఆనవాళ్లున్నాయి. దీని పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో భవిష్యత్తు తరాలకు ఆ ఇంజినీరింగ్‌ అద్భుతాన్ని పరిచయం చేసే అవకాశం లేకుండా పోతుంది.’ అని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి, విశ్రాంత పురావస్తు అధికారి ఖయ్యూం  పేర్కొన్నారు. సుమారు నాలుగొందల ఏళ్ల క్రితమే గురుత్వాకర్షణ(గ్రావిటీ) శక్తితో ఇళ్లకు నీటి సరఫరా జరిగింది.

కోటలు, రాజమందిరాల్లోని రెండుస్తుల వరకు నీళ్లు చేరాయి. ఫౌంటైన్లలో నీళ్లు ఉవ్వెత్తున ఎగిశాయి. అంతెందుకు చార్మినార్‌ పైఅంతస్తు వరకు నీళ్లు వెళ్లేవి. గండిపేట, హిమాయత్‌సాగర్‌ నుంచి 18 కి.మీ దూరం గ్రావిటీతో నీరు సరఫరా అయింది. ఇప్పటితరం నమ్మలేని నిజమిది. అప్పటి ఇంజినీరింగ్‌ అద్భుతానికి తార్కాణమిది. దుర్గం చెరువు నుంచి గోల్కొండ కోట వరకు విస్తరించిన ‘నెహర్‌ నాలా’ అలాంటి అబ్బురాల్లో ఒకటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles