The life story and specialization of Blue parrotfish | different species of fish | Sea animals

Blue parrotfish life story different species of fish

Blue parrotfish, Blue parrotfish life story, Blue parrotfish photos, species of fishes, Blue parrotfish specialization, Blue parrotfish history

Blue parrotfish Life story different species of fish : The life story and specialization of Blue parrotfish.

బ్లూ పారట్‌ఫిష్.. ఇదో విచిత్రమైన జలచర జీవి!

Posted: 07/09/2015 01:06 PM IST
Blue parrotfish life story different species of fish

దేవుడు సృష్టించిన విచిత్రమైన జలచర జీవుల్లో ‘బ్లూ పారట్‌ఫిష్’ (నీలి చేప) ఒకటి. ఈ చేపలో చెప్పుకోదగిన ప్రత్యేకతలు దాగి వున్నాయి. సాధారణంగా అన్ని జీవరాశుల్లో దంతాలు నోట్లో వుంటాయని తెలిసిందే! కానీ.. ఈ చేపకు నోట్లో వుండటంతోపాటు గొంతులోనూ వుంటాయి. ఆ దంతాలను ‘పారింగ్జల్ టూత్’ అంటారు. అట్లాంటిక్, కరిబీయన్ సముద్రాల్లో ఎక్కువగా వుండే ఈ చేప దవడ చూడటానికి అచ్చం చిలుక ముక్కులా కనిపిస్తుంది. ఈ చేపకు సంబంధించిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం..

విశేషాలు :

* చిలుక ముక్కులాంటి దవడ ఉంటుంది కాబట్టి ఈ జాతి చేపల్ని ప్యారట్‌ఫిష్ అంటారు. కానీ దీని రంగుని బట్టి బ్లూ ప్యారట్‌ఫిష్ అని పేరు పెట్టారు. ఈ నీలి చేపలు సుమారు 29 అంగుళాల వరకు ఎదుగుతాయి. ఈ చేపలు ఎక్కువగా కోరల్ రీఫ్ రాళ్ల దగ్గర ఉంటాయి.

* ఈ చేపలో దంతాలు నోట్లో వుండటంతోపాటు గొంతులోనూ పళ్లుంటాయి. వాటిని ‘పారింగ్జల్ టూత్’ అంటారు. ఈ పళ్లతో ఆ చేప ఏకంగా రాళ్లనే ఇసుకలా తొలిచి.. అందులో నాచును తినేస్తుంది. దవడ, దంతాలతో రాళ్లపై ఉన్న ఆల్గేను తొలుస్తూ కడుపు నింపుకుంటుంది.

* ఈ చేప ఆహారం కోసం సముద్రంలో పగడపు దీవుల్లోని రాళ్లను పళ్లతో నిత్యం గీరుతుంటుంది. ఇలా చేయడం వల్ల బోలెడంత ఇసుక తయారవుతుంది. ఇలా ఒకో చేప ఏడాదికి సుమారు 90 కిలోల ఇసుకను తయారుచేస్తుంది. కొన్ని బీచ్‌ల్లో తెల్లగా కనిపించే ఇసుక వీటి వల్ల ఏర్పడిందే.

* వీటికి కూడా బ్లూ క్వాబ్స్, బ్లూ ప్యారట్స్, బ్లూమ్యాన్ అంటూ చాలా పేర్లు ఉన్నాయి. ఇవి ఎక్కువగా అట్లాంటిక్, కరిబీయన్ సముద్రాల్లో ఉంటాయి. అయితే.. కాలక్రమంలోని మార్పుల వల్ల ఈ నీలి చేప క్రమంగా అంతరించిపోతోందని, శాస్త్రవేత్తలు ఈ చేపను కాపాడే చర్యలు మొదలెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Blue parrotfish  species of fishes  

Other Articles