The Historical Story of Gang River | Gangotri Temple History | Hindu Puranas

History of ganga river birth in gangotri uttarakhand north kashi

ganga river history, ganga river story, ganga river, gangotri temple, gangotri temple history, gangotri temple, gangotri village, uttarakhand state news, north kashi updates, ganga river news

History of ganga river birth in gangotri uttarakhand north kashi : The Historical Story of Gang River which is located at gangotri village north kashi uttarakhand state.

‘గంగోత్రి’.. గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన పుణ్యక్షేత్రం

Posted: 07/03/2015 04:34 PM IST
History of ganga river birth in gangotri uttarakhand north kashi

దేశంలో వెలసిన పవిత్రపుణ్యక్షేత్రాల్లో ‘గంగోత్రి’ ఒకటి. గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వుంది. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 4,042 మీటర్ల ఎత్తులో వుంది. ఈ ప్రదేశం హిమాలయాల్లోని చార్‌ధామ్‌లలో ఒకటి. అక్కడ గంగానది బాగీరథి పేరుతో పిలువబడుతుంది. పూర్వం గంగాదేవిని భూమికి తీసుకోవడానికి భాగీరథుడు కారణం కాబట్టి.. ఆ పేరు వచ్చింది. గంగాదేవి భూవిలో నదిరూపంలో ప్రతిష్టితమవడానికి ఓ పురాణగాధ వుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...

పురాణ గాధ :

పూర్వం.. ‘సగరుడు’ అనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్ధం ‘ఆశ్వమేధ’ యాగం చేశాడు. అప్పుడు సగరుని వైభవాన్ని చూసిన స్వర్గరాజు దేవేంద్రుడు.. సగరుడు తనపదవికి పోటీకి వస్తాడేమోనన్న భయపడతాడు. దాంతో సగరుడి యాగాన్ని ఎలాగైనా భంగం కలిగించాలని భావించి.. సగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరిస్తాడు. అనంతరం ఆ అశ్వాన్ని కపిలముని ఆశ్రమంలో కట్టి వేసి... ఏమీ తెలియనట్టుగా తిరిగి వెళ్లిపోతాడు. ఈ మొత్తం తతంగం సగరుని 60 వేల కుమారులకు తెలియదు. ఆ అశ్వాన్ని కపిలమునియే అపహరించాడని భావించి.. అశ్వరక్షణార్ధం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. తపో దీక్షలో ఉన్న కపిలమునిని భంగం కలిగిస్తారు. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఆ కపిలముని.. తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని భస్మం చేస్తాడు.

అలా కపిల మునిచే భస్మం కావింపబడ్డ తన పిత్రుల ఊర్ధ్వ గతుల కోసం సగరుని మనుమడు అయిన భాగీరథుడు తపస్సు చేశాడు. గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పిత్రులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అయితే.. గంగాదేవి తన రాకను భూమి భరించలేదని, దానిని భరించగలిగినవాడు ఒక్క సాంభశివుడేనని చెప్తుంది. అప్పుడు భాగీరథుడు.. గంగాదేవిని భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాఝూటాలలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లు పురాణాలు చెప్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ganga river  gangotri temple  hindu puranas  

Other Articles