Bal thackeray life history

Bal Thackeray,Bal thackeray life history,Hindutva, Shivaji Park, Mumbai, Shiv Sena Bhavan, Matoshree,bal thackeray, mumbai, shiv sena, maharashtra, cremation, last rites, funeral, sena bhavan, shivaji park, shiv sainiks

The cartoonist turned politician was often portrayed as a roaring tiger, the much cherished logo of his party Shiv Sena, which he formed to accord dignity to Maharashtrians but which became known as a party of restless youngsters out for trouble.

Bal Thackeray life history.png

Posted: 11/19/2012 12:13 PM IST
Bal thackeray life history

Bal_Thackerayమరాఠా టైగర్ ! 

గర్జన.. ఘర్షణ... ఇదే ఆయన జీవితం 

ఆయనంటే ఒక భయం ! ఆయన... ఒక భరోసా !

50 ఏళ్ల ఉద్యమ ప్రయాణం ముగించిన శివ సేనాధిపతి... బాల్‌ఠాక్రే ఇక లేరు !

ఆయన కొందరికి సమస్య ! అనేకమందికి పరిష్కారం !
ఆయన మాట వేదం ! ఆయన రాత... శిలాక్షరం !
ఆయన ఒక వివాదం ! ఆయనది పిడి వాదం !

మరాఠా పులి, శివసేనాధిపతి బాల్ ఠాక్రే ఇక లేరు. కార్టూనిస్టుగా, రాజకీయ వేత్తగా, కరుడుగట్టిన హిందూ మతాభిమానిగా, కింగ్‌గా, కింగ్ మేకర్‌గా... దాదాపు ఐదు దశాబ్దాలు ముంబైని అనధికారికంగా ఏలిన బాల్ ఠాక్రే అస్తమించారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల ఠాక్రే... ముంబైలోని తన నివాసం 'మాతోశ్రీ'లో తుదిశ్వాస వదిలారు.ఆయన కనుసైగ చేస్తే ముంబై స్తంభించి పోతుంది. ఆయన నోటి మాట ముంబైకర్లకు శాసనమై కూర్చుంటుంది. ఆయన గీత ప్రత్యర్థులను శూలంలా గుచ్చుతుంది. ఆయన రాతలోని ప్రతి పదం సంచలనంలా మారుతుంది. ఆయన 'ఊహూ...' అంటే బాలీవుడ్ కెమెరా కన్ను మూతపడుతుంది. కథ మారిపోతుంది. ఆయన మాట వింటే 'మరాఠా' గుండె గర్వంగా ఉప్పొంగుతుంది. ఇప్పుడు... ఆ కన్ను మూతపడింది. ఆ మాట ఆగిపోయింది. ఆ శ్వాస నిలిచిపోయింది.

ఒక కార్టూనిస్టు స్థాయి నుంచి ఒక రాష్ట్ర రాజకీయాలను శాసించగలిగే స్థాయికి ఎదిగిన బాలా సాహెబ్‌ కేశవ్‌ థాక్రే మరాఠీల మనసులలో పీఠం వేసుకున్నారనడం అతిశయోక్తి కాదు. సామాజిక ఉద్యమకారుడు, రచయిత అయిన కేశవ థాక్రేకు 1926, జనవరి 23వ తేదీన బాల్‌ థాక్రే జన్మించారు. కేశవ్‌ థాక్రే 1950వ దశకంలో ముంబై రాజధానిగా మరాఠీ మాట్లాడేవారందరికీ ప్రత్యేక మహారాష్టన్రు ఏర్పాటు చేయాలం టూ ఐక్య మహారాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.బాలాసాహెబ్‌ పై తండ్రి ప్రభావం అధికంగా ఉంది. విద్యాభ్యా సం పూర్తి అయిన ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌లో కార్టూనిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన బాల్‌ 1960లో సోదరుడితో కలిసి స్వంత రాజకీయ పత్రిక మార్మిక్‌ను ప్రారంభించడం కోసం అక్కడ రాజీనామా చేశారు. తండ్రి రాజకీయ భావజాలంతో ప్రభావితుడైన బాలాసాహెబ్‌ ముంబైలో గుజరాతీల, మార్వాడీల, దక్షిణ భారతీయుల ప్రభావం పెరగడానికి వ్యతిరేకంగా మార్మిక్‌ ద్వారా ప్రచారం ప్రారంభించారు. ముంబై రాజకీయ, ప్రొఫెషనల్‌ వేదికపై మహారాష్ట్రీయులకు బలమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో 1966లో శివసేన పార్టీని ఆయన ప్రారంభించారు. పార్టీని ప్రారంభించిన తొలి దశాబ్దంలో మహారాష్టల్రోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలతో ఆయన తాత్కాలిక పొత్తులు కుదుర్చుకున్నారు.

Bal_Thackeray1పార్టీని ప్రారంభించినప్పుడు మహారాష్ట్రు ల హక్కుల కోసం పోరాటం, వలస వచ్చిన వారి నుంచి వారి ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు లేకుండా భద్రత కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉండేది. 1989లో బాలాసాహెబ్‌ ‘సామ్నా ’ అనే మరాఠీ దినపత్రికను ప్రారంభించారు. రాజకీయంగా వామపక్ష వ్యతిరేక వైఖరి కలిగి ఉన్న శివసేన, ముంబైలో ఉన్న ట్రేడ్‌ యూనియన్లపై ఆధిపత్యం చలాయిస్తున్న వామపక్షా ప్రభావాన్ని తగ్గించి వాటి నియంత్రణను చేపట్టాయి. ఈ క్రమంలో గుజరాతీ, మార్వాడీ వ్యాపారవేత్తల నుంచి ఆయన బలవంతపు వసూళ్ళకు పాల్పడ్డారు. అనంతర కాలంలో హిందూత్వ అంశంపై భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు. 1995లో బిజెపి-శివసేన కూటమి రాష్ట్ర ఎన్నికలలో గెలుపు సాధించి, అధికారంలోకి వచ్చింది.ఈ కూటమి అధికారంలో ఉన్న 1995- 1999 మధ్య కాలంలో ప్రభుత్వ విధానాలలో ఆయన పోషించిన ప్రధాన పాత్ర కారణంగాను, తెరవెనుక నిర్ణయాల కారణంగానూ ఆయనకు రిమోట్‌ కంట్రోల్‌ అనే పేరు వచ్చింది. 1999లో ఎన్నికల కమిషన్‌ 2005 వరకు అంటే ఆరేళ్ళ పాటు బాల్‌ థాక్రేను ఎన్నికలలో పోటీ చేయడం నుంచి వోటింగ్‌ చేయడం నుంచి ఎన్నికల కమిషన్‌ నిషేధించింది. ఆయన పై నిషేధం ఎత్తివేసిన తర్వాత 2006లో జరిగిన బొంబాయి మనిసిపల్‌ ఎన్నికలలో తొలిసారి ఆయన ఓటు వేశారు.

Bal_Thackeray4మరాఠీ మనూస్‌ (మహారాష్ట్ర సామాన్య మానవుడు) కు శివసేన సాయపడుతోందని, హిందువుల హక్కుల కోసం కూడా పోరాడిందని థాక్రే అంటారు. హిందుత్వ పట్ల థాక్రేకు అమితమైన మమకారం, ఎవరైనా హిందూ మతాన్ని, అస్తిత్వాన్ని వ్యతిరేకిస్తే హిందువులంతా కలిసి పోరాటం చేయాలని ఆయన పిలుపిస్తారు. ఇంతగా పోరాటం చేసినప్పటికీ శివసేన ప్రతిపక్ష వామపక్ష పార్టీల విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. శివసేన అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర యువత నిరుద్యోగ సమ స్యను పరిష్కరించడం కోసం ఏమీ చేయలేదన్నది వారి ఆరోపణ. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా అనుసరించిన థాక్రే అనేక వివాదాల్లో చిక్కుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. 1993లో జరిగిన ముంబై అల్లర్ల సందర్భంగా ముస్లింలపై దాడి చేయమంటూ బహిరంగంగా సామనా పత్రికలో ఆయన రాసిన సంపాదకీయం పెద్ద చిచ్చునే రేపింది. దీనిపై పెట్టిన కేసులో ఏడేళ్ళ తర్వాత థాక్రేను అరెస్టు చేసినప్పుడు ముంబై స్తంభించపోవడాన్ని గమనించిన దేశం ఆశ్చర్యానికి లోనైంది.

నేను ధృతరాష్ట్రుడిని కాను"

ఏం జరుగుతున్నా పట్టించుకోకపోవడానికి నేను ద్రుతరాష్ట్రుడిని కాదు''... శివసేన అధినేత బాల్‌ఠాక్రే మాటలివి. శివసేనలో అంతర్గత విభేదాలు పొడసూపి, తన మేనల్లుడు రాజ్‌ఠాక్రే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్‌ఠాక్రే అంశంపై విలేకరులు అప్పట్లో వివరణ కోరగా.. "ఒకవేళ నేను నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నా కూడా.. మహాభారతంలో ధృతరాష్ట్రుడిలా వ్యవహరించలేను.
అయినా.. రాజ్ నిర్ణయం నాకు బాధ కలిగించింది. దీన్ని కలలో కూడా ఊహించలేదు'' అని బాల్‌ఠాక్రే పేర్కొన్నారు. అంతేకాదు.. తన కొడుకు ఉద్ధవ్, రాజ్ కలిసి చర్చిస్తే సరిపోయేదని, రాజ్ మనస్సును కలుషితం చేసిన 'గురువు' ఎవరోనని వ్యాఖ్యానించారు. శివసేన నుంచి వెళ్లిపోయిన రాజ్‌ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను స్థాపించిన విషయం తెలిసిందే. దీనిపై బాల్‌ఠాక్రే చివరివరకూ బాధపడుతూనే ఉన్నారు.

Bal_Thackeray2చేతిలో సిగార్..

నల్లటి కళ్లజోడు, నుదుట నిలువెత్తు నామం, లాల్చీ పైజామా, భుజంపై శాలువా, మెడలో దండలు... ఇది బాల్‌ఠాక్రే ఆహార్యం. గర్జిస్తున్న పెద్ద పులి బొమ్మ... దాని ముందు సింహాసనంపై కూర్చున్న ఠాక్రే ! ఇది ఆయన ట్రేడ్ మార్క్ ఫొటో ! గతంలో ఎప్పుడూ ఆయన చేతిలో పైప్ కనిపిస్తుండేది. గుప్పు గుప్పుమని పొగ వదిలేవారు. కానీ, 1995లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నాక ఆ అలవాటు మానుకోవాల్సి వచ్చింది.కానీ, పూర్తిగా పొగతాగడం మానలేక సిగార్ మొదలుపెట్టారు. మార్కోపోలో, త్రీ నన్స్, హెన్రీలాంటి బ్రాండ్లంటే ఆయనకు ఇష్టం. హవానా నుంచి చర్చిల్ బ్రాండ్ సిగార్లు ఎక్కువగా తెప్పించుకునేవారు. 1954లో కార్టూనిస్ట్‌గా ఉన్నప్పుడు తరచు జలుబు చేస్తుండటంతో తొలిసారి తనకు పొగతాగడం అలవాటైందని ఓ సందర్భంలో ఠాక్రే చెప్పారు. భార్య, కుమారుడు మరణించాక ఒంటరితనం ఎక్కువైందని, అప్పటినుంచి సిగార్లే తనకు ఊరటనిచ్చాయని చెప్పేవారు.

Bal_Thackeray3వరుస విషాదాలు...

బాల్ ఠాక్రే భార్యపేరు మీనా. వీరికి ముగ్గురు పిల్లలు బిందుమాధవ్ ఠాక్రే, జయదేవ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే. 1996లో బాల్ ఠాక్రే భార్య మీనా గుండెపోటుతో మరణించారు. అంతకు కొన్ని నెలల ముందు బిందుమాధవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రెండు ఘటనలు ఠాక్రేను కలిచి వేశాయి.

సంచలనాల 'సామ్నా'

జాతీయ, అంతర్జాతీయ విశేషాలేమిటి? వాటిపై బాల్ ఠాక్రే అభిప్రాయాలేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేది 'సామ్నా' పత్రిక! ఇది... శివసేన అధికార పత్రిక. 1989లో ఠాక్రే దీనిని ప్రారంభించారు. తన ఉద్దేశాలను, భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచేవారు. వర్తమాన వ్యవహారాలపై ఘాటైన సంపాదకీయాలు రాసేవారు.చివరి రోజుల్లో అనారోగ్యంతో...బాల్ ఠాక్రే కొన్ని నెలలుగా ఊపిరితిత్తులు, క్లోమ గ్రంధి వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది జూలైలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా శివాజీ పార్క్‌లో విజయ దశమి సందేశం వినిపించే ఆయన... ఈసారి మాత్రం అక్కడికి రాలేకపోయారు. దీపావళి తర్వాత ఆయన దాదాపుగా మంచానికే పరిమితమయ్యారు.

Bal_Thackeray_amitabబాల్‌ఠాక్రే తన జీవితంలో ఎప్పు డూ, ఎలాంటి అధికార పదవి చేపట్టలేదు. ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చే యలేదు. కానీ... మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. బాలీవుడ్ స హా అనేక పరిశ్రమలలో కార్మిక సం ఘాలు ఆయన కనుసన్నల్లో నడిచేవి. క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖలం తా ఠాక్రే అనుగ్రహం కోసం ఎదురు చూసే వారే. చివరికి పాప్‌స్టార్ మైకే ల్ జాక్సన్ కూడా ముంబైలో తన ప్ర దర్శన ఇచ్చే ముందు ఠాక్రే 'ఆశీర్వాదం' తీసుకోవాల్సి వచ్చింది. ల తా మంగేష్కర్, సచిన్, అమితాబ్ అంతా ఠాక్రేకు అభిమానులే. అయి తే... ఆయన జీవిత చరమాంకంలో మాత్రం పార్టీలో 'క్షీణ దశ'ను కళ్లజూశారు.

వారసత్వ పోరు నేపథ్యం లో... తన తమ్ముడి కుమారుడు రాజ్ ఠాక్రే శివసేన నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. శివ సైనికులు వర్గాలు గా విడిపోయి పలు సందర్భాల్లో రో డ్లపై కొట్టుకోవడం వంటి ఘటనల నూ చూశారు. ఇవన్నీ... చివరి రోజుల్లో ఠాక్రేను బాగా కలచివేశాయి. చివరికి... మొన్న దసరా రోజున ఆ యన రాజకీయాల్లో తన 'రిటైర్‌మెంట్'ను ప్రకటించేశారు. ఆయన స్వ యంగా ఈ సమావేశంలో పాల్గొనలేక... వీడియో రికార్డ్‌ను పంపించా రు. ఏది ఏమైనా.. ముంబైని రెండు రకాలుగా చూడాలి! ఠాక్రే ఉన్న ముంబై ! ఠాక్రే అనంతర ముంబై !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Comedy king relangi vardhanti
Ntrs raktha sambandham movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles