Comedy king relangi vardhanti

Relangi, Comedy king relangi, Vardhanti, Tollywood golden comedian, Relangi comedy, relangi comedy videos, jokes, Comedy Scenes

Comedy king Relangi Venkata Ramaiah's Vardhanti.

Comedy king Relangi Vardhanti.png

Posted: 11/26/2012 05:03 PM IST
Comedy king relangi vardhanti

Relangiషూటింగ్ అయ్యాక తన కారులో వెలుతూ, " వెనక సీటు ఖాళీ మాంబళం, మాంబళం ... " అని బస్సు కండక్టర్ లా అరుస్తూ అసిస్టెంట్ డైరెక్టర్లని, చిన్న వేషాలు వేసే నటులను ఎక్కించుకొని తీసుకొని వేళ్ళేవారు.

తెలుగు హృదయాల్లో రేలంగి చిరంజీవి !!

పామరుల నుంచి పండితుల వరకు ' రేలంగోడు ' లేని సినిమా రుచించని శకం ఇప్పటికీ కొనసాగుతున్నదంటే అతిశయోక్తి కాదు. నటుల్లో రేలంగి, రచయితల్లో పింగళి, ముళ్ళపూడి, జంధ్యాల సమగ్ర సంపూర్ణ హాస్యరసం కురిపించి దాని స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపిన వారంటే అత్యుక్తి కాదు. రేలంగి, రమణారెడ్డి ద్వయం ఆనాటి హాస్యరస దేవతకు రెండు కళ్లు.ఆ తరువాత వచ్చిన హాస్య నటుల్లో చాలామందిని ప్రభావితం చేసింది రేలంగి ఫక్కీ హాస్యంతో పాటు కరుణ, రౌద్ర రసాలను కూడా సమర్ధవంతంగా పలికించిన ప్రతిభశాలి.

నేను ఆంధ్ర సచిత్ర వార పత్రికకు సినిమా ఎడిటర్ గా వున్న రోజుల్లో (1959-63) తరచుగా ఆయన్ని కలిసే అవకాశం కలిగేది ఆయనలేని సినిమా ఉండకపోవడమే దానికి కారణం. నిర్ణీత సమయానికి వచ్చి రంగు పూసుకుని సెట్ బైట ఎన్ని గంటలైనా వేచి వుండిన ఆనాటి నటులు సి.ఎస్.ఆర్. రేలంగి, ముక్కాముల వంటి వారిలోని క్రమశిక్షణ, సహన రూపంలో వారు చూపిన సంస్కారం, తమ వృత్తి పట్ల వారికి గల అంకిత భావం ప్రత్యక్షంగా చూసే అవకాశం పత్రికా విలేఖరిగా నాకు కలిగింది. ఆయన కోపం, దుఃఖం, రౌద్రం, అన్నీ హాస్యమే కురిపించేవి !

ఇక రేలంగి గారి గురించి,  ఇంకొక మహా వ్యక్తీ, తనికెళ్ళ భరణి గారు, ఈ విధంగా రాసారు;
హాస్యానికి రేలంగనే మరు పేరుందని హాస్యానికీ తెలిదు రేలంగికీ తెలీదు తెల్సినవాడు ఒక్కడే తెలుగు వాడు ఆయన తెరమీదకు రాకుండానే నవ్వులూ వెళ్ళిపోగానే నిట్టూర్పులూ ఉన్నంత సేపూ చప్పట్లూ ఆయన్ది వొళ్ళు విరుచుకోని కామెడీ మొహం చిట్లించని హాస్యం తెరనిండుగా రేలంగుంటే తెలుగువాళ్ళకి పండుగే రేలంగి పోతే తెలుగు వాళ్లెవరూ ఏడవలేదు సరిగద ‘నవ్వారు ’ రేలంగే౦ తక్కువ తిన్నాడా పోయినట్లే పోయి తెలుగు వాళ్ళ గుండెల్లో ‘ఉండిపోయాడు ’
అటు వంటి ఈ మహా నటుడి వర్ధంతి నిన్న.

అయితే, ఎన్నో అలనాటి ఆనిముత్యాలలో తన నటనతో, భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఈ నవ్వుల రారాజు ఎప్పటికి మన మనస్సులో నిలిచిపోతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghantasala jayanti
Bal thackeray life history  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles