చంద్రగిరి టీడీపీ రాజకీయాలు ఎటువైపు? | Galla Aruna happy with TDP.

Galla aruna not to join hands with pawan

Galla Aruna Kumari, TDP MLA, Chitoor MLA, TDP Chittoor Politics, Galla Aruna TDP, Galla Aruna Janasena, Galla Aruna YSRCP, Galla Aruna Kumari Pawan kalyan, Galla Insult in TDP

Former Minister and Telugu Desam Party leader from Chittoor Galla Aruna Kumari not join in any party. Rumours sorrounded that she was eyed on YSRCP and Janasena.

చిత్తూరు రాజకీయాల్లో చిచ్చు కోసమేనా?

Posted: 01/21/2017 11:10 AM IST
Galla aruna not to join hands with pawan

ఇన్నాళ్లూ అధికార పక్షం లోకి కొనసాగుతున్న జంపింగ్ ల పర్వం యూటర్న్ తీసుకోబోతుందని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సూటిగా చెప్పాలంటే చంద్రగిరి ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారి తెలుగుదేశం పార్టీని వీడబోతుందని ఆ వార్తల సారాంశం.

ఆరునెలల క్రితం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైపు ఆమె దృష్టి మల్లుతోందని, జగన్ భేటీ కూడా అయ్యిందని చెప్పుకొగా, ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఆమె చేరబోతుందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన గల్లా అరుణకుమారికి ఆ సమయంలో సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి చాలా ఫ్రాదాన్యత కలిపించాడు. కీలకమైన ఆరోగ్యశాఖ మంత్రి పదవిని కట్టబెట్టడంతోపాటు, మంత్రి వర్గ భేటీల్లో కూడా ఆమె నిర్ణయాలను కూడా పరిగణనలోకి తీసుకునేవాడు. నిజానికి ఆరోగ్యశ్రీ పథకానికి ప్రధాన సూత్రధారి గల్లా అనే చెప్పుకుంటారు.

అంతటి కీలక వ్యక్తి తర్వాతి పరిణామాలతో తెలుగుదేశంలోకి చేరిపోయింది. అయితే అప్పటి నుంచే ఆమె కష్టాలు మొదలయ్యాయంట. కనీసం గ్రామ స్థాయి నేతకు కూడా ఇచ్చే గౌరవం ఇవ్వట్లేదని, చివరకు తన గోడును వెల్లబుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆమె వాపోతున్నట్లు టాక్. దీనికి తోడు సంక్రాంతి పోస్టర్లలో చంద్రబాబు నాయుడు కాకుండా, పవన్ కళ్యాణ్ ఉన్న పోస్టర్లు వెలియటంతో ఆమె జనసేన లో త్వరలో జాయిన్ అవుతుందనే పుకార్లు రేగాయి.

అయితే ఆమె టీడీపీతో సంతృప్తిగానే ఉందని, పార్టీ మారే యోచనలో లేదని ఆమెకు అత్యంత సన్నిహితులైన వాళ్లు చెబుతున్నారు. పైగా తనయుడు గల్లా జయదేవ్ ఎంపీగా పార్టీలో బాగా రాణిస్తుండటంతో ఆమెకు పార్టీ మారాల్సిన అవసరం లేదనే వాళ్లు చెబుతున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు కూడా టీడీపీ-జనసేన పరస్సర సహకార ఒప్పందం కాబట్టి గల్లా పార్టీ మారే వార్త ఉత్తదేనంటూ తేల్చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో టీడీపీని దెబ్బతీసే క్రమంలో భాగంగానే ప్రత్యర్థులు ఇలాంటి వాటిని సృష్టిస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Galla Aruna Kumari  Janasena  

Other Articles