నగదు విత్ డ్రాలపై బడ్జెట్ లో మరిన్ని అంక్షలు..? Govt may lower PAN quoting limit on cash transaction

Government may lower limit for quoting pan number for cash transactions

Government, PAN number, cash transactions, demonetisation, PAN card, cash withdrawals, cash restrictions

After demonetisation and restrictions on cash withdrawals, the government may announce big disincentives in the upcoming Budget for usage of cash.

నగదు విత్ డ్రాలపై బడ్జెట్ లో మరిన్ని అంక్షలు..?

Posted: 01/19/2017 03:07 PM IST
Government may lower limit for quoting pan number for cash transactions

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశంలో అవినీతి తగ్గుతుందని అశించిన కేంద్ర ప్రభుత్వం.. వాటి ఫలితాలు వచ్చాయా..? లేదా..? అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపైపెచ్చు.. పాత పెద్ద నోట్ల రద్దు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిజిటల్ ఇండియా, క్యాష్ లెస్ ఎకానమి దిశగా అడుగులేస్తున్నామని చెప్పుకోచ్చింది. ఇక అవినీతి సోమ్ము ఎంతమేరకు బయటపడిందన్న విషయాన్ని కూడా మరుగున పెట్టేసిన కేంద్రం.. ఉద్రవాద, అంతర్గత తీవ్రవాద సమస్యలకు పెద్ద నోట్ల రద్దు చెక్ పెట్టిందని చెప్పుకోచ్చింది.

నిజానికి పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులు, ఏటీయంల క్యూలైన్లలో నిలబడిన పలువురు వయోవృద్దులు, యువకులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే వారికి ఎలాంటి పరిహారం ఇస్తున్నట్లు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. కాగా, బీహార్ లో పడవ మునకలో మృతుల కుటుంబాలకు మాత్రం ప్రధాని మోడీ రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఇక ఇప్పుడిప్పుడే ప్రజలు కొంత డీమానిటైజేషన్ ప్రభావం నుంచి ఉపశమనం పోందుతున్న క్రమంలో ప్రజలపై మరిన్నీ అంక్షలకు కేంద్రం సిద్దమైనట్లు సమాచారం.

ఇకపై నగదు లావాదేవీలపై మరిన్ని చెక్పాయింట్లు పెట్టాలని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే బడ్జెట్లో నగదు వాడకంపై మరిన్ని ఆంక్షలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాన్ కార్డు అవసరమయ్యే నగదు లావాదేవీల మొత్తాన్ని ప్రభుత్వం మరింత తగ్గించేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇన్ని రోజులు రూ.50వేల నగదు కొనుగోళ్లపై ప్యాన్ కార్డును తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఇక తాజాగా ఈ పరిధిని రూ.30 వేలకు కుదించనున్నట్లు సమాచారం. దీంతో రూ.30 వేలకు సరిపడ ఏమైనా కొనుగోళ్లు చేపడితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
 
ఇటు పాన్ కార్డు వివరాలు అవసరమయ్యే వ్యాపారి లావాదేవీలను ప్రభుత్వం తగ్గించేస్తుందట. వీటితో పాటు నిర్దేశించిన పరిమితికి మించి నగదు చెల్లింపులు జరిగితే, వాటికీ చార్జీలు వేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. లక్షకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఈ చార్జీలను వేయనుందని టాక్. ఈ చర్యలతో తక్కువ నగదు వాడకాన్ని  ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాక బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు విత్డ్రాయల్స్ను ప్రభుత్వం తగ్గించనుంది. నగదు రహిత ఎకానమీకి ఈ చర్యలు ఎంతో సహకరించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles