Instead of cornering YSRCP, pattipati pullaRao should target Naidu

Not jagan or ysr naidu should be cornered

Prathipati Pulla rao and Chandrababu Naidu in politics, Prathipati Pulla rao and Chandrababu Naidu comparision, Prathipati Pulla rao and Chandrababu Naidu political journey, Prathipati Pulla rao latest updates, NT RamaRao, YS rajashekar reddy, TDP founder president

Instead of targeting Chandrababu Naidu, Prathipati Pulla rao is being cornered in many instances. A few of those are discussed inside.

బాబు పంచన చేరి గుడి మింగినవాడిపై విమర్శలా.?

Posted: 09/04/2015 07:38 PM IST
Not jagan or ysr naidu should be cornered

గుడిని మింగిన వాడు ఒకడైతే.. గుడిని, గుడిలోని లింగాన్ని మింగిన వాడు మరోకడు.. అంటూ పెద్దలు చేప్పిన సామెత.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును చూస్తే.. ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యాలను పరిశీలిస్తే ఇప్పుడు తప్పక గుర్తుకువస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి రోజున.. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైఎస్ ఫోటోపై లేవనెత్తిన చర్చ సందర్భంగా అసెంబ్లీలో వారి విమర్శలను ఖండిస్తూ పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పర్చుకుని పథిలంగా వున్న టీడీపీ వ్యస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారాక రామారావు ఉనికి దెబ్బతీసినందునే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపఠాన్ని అసెంబ్లీ లాంజీల్లోంచి తొలగించామని ఆయన అసెంబ్లీలో చర్చ సందర్భంగా చెప్పారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం కమిటీ తీసుకుంటుందని చెప్పిన ఆయన.. శంషాబాద్ విమానాశ్రాయానికి ప్రతిపాధించిన ఎన్టీయార్ పేరును తొలగించి.. రాజీవ్ గాంధీ పేరు పెట్టారని ఆయన ప్రస్తావించారు. ఇలా అనేక విధాలుగా ఎన్టీయార్ ఖ్యాతిని మరుగున పడేట్లు చేసింది రాజశేఖర్ రెడ్డేనని విమర్శించారు.

ఇంతవరకు బాగానే వున్నా.. అసలు ఎన్టీరామారావును పదవీచ్యుతుడిని చేసింది చంద్రబాబు నాయుడన్న విషయం మాత్రం పత్తిపాటికి ఎందుకు గుర్తుకు లేదో ఆయనకే తెలియాలి. జామాతా దశమ గ్రహా: అంటూ మనోవేధనకు లోనైన ఎన్టీయార్ చెప్పిన విషయాలు కూడా పత్తిపాటికి గుర్తులేవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తన అల్లుడిపై ఆక్రోశం వ్యక్తం చేసిన ఎన్టీరామారావు.. చంద్రబాబుకు బుదులుగా తన కొడుకు హరికృష్ణను నాయకుడిగా ఎందుకొమ్మని అప్పట్లో చేసిన వినతి కూడా పత్తిపాటి విస్మరించారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎన్టీరామారావు మనోవేధనతో ఆకస్మికంగా మృతి చెందడానికి కారణాలలో ఎవరెవరి ప్రమేయం వుందో వారికే తెలియాలి.

ఎన్టీరామారావు చివరి నిమిషంలో చేసిన వ్యాఖ్యలపై గుర్రుగా వున్న చంద్రబాబు.. ఆ తరువాత టీడీపీ అంటే తానేనన్నట్లు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టారు. టీడీపీలో అప్పటివరకు కనిపించిన ఎన్టీయార్ చిత్రాన్ని కూడా మరుగున పడేశారు. మళ్లీ బడికి, జన్మభూమి, చేయూత ఇలా అనేక కార్యక్రమాలు ద్వారా రాష్ట్ర ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్న చంద్రబాబు.. ఉచితంగా టోపీలను, ఇంటి తోరణాలను, కులవృత్తుల వారికి పనిముట్లను పంఫిణీ చేశారు. వాటిపై ముద్రించింది మాత్రం కేవంల చంద్రబాబు ఫోటోలే. మూడు నెలలకో పర్యాయం జన్మభూమి కార్యక్రమాలను ఏర్పాటు చేయించి మహిళలు, వితంతువులు, వికలాంగులకు, వృద్దులకు పింఛన్ ఇచ్చారు. అయితే ఎక్కడా.., ఎవరి నోట కూడా ఎన్టీరామారావు అన్న మాట వినబడకుండా చేయడంలో సఫలీకృతుడయ్యారు.

ఎన్టీరామారావు అస్తమించిన నాటి నుంచి ఆయనకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పట్లో కేంద్రంలో వున్న యూనైటెడ్ ఫ్రంట్ సహా ఆ తదనంతరం వచ్చిన నేషనల్ డెమెక్రటిక్ కూటములలో చక్రం తిప్పి.. తన పార్టీకి చెందిన ఎంపీ బాలయోగిని లోక్ సభ స్పీకర్ చేయించారు. అంతేకాదు అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయాలని అప్పటి ప్రధాన మంత్రి వాజ్ పాయ్ కి సూచించి, ప్రతిపాదించింది కూడా తానేనని చెప్పుకున్న చంద్రబాబుకు ఎన్టీరామారావుకు భారత రత్న అవార్డును ఇప్పించడం మాత్రం కష్టంగా మారిందా..? అన్న విషయం కూడా పత్తిపాటికే తెలియాలి. ఇలా ఎన్టీరామారావుకు అడుగడుగునా వ్యతిరేకంగా మారిన చంద్రబాబు.. చివరకు ఆయన కుటుంభ సభ్యులను కూడా ఎన్నికల నేపథ్యంలో వాడుకుని వదిలేశారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నా వాటిపై ఎందుకు స్పందించలేదో కూడా అమాత్యులు గ్రహించాలి.

ఎన్ టి రామారావును ఉనికి దెబ్బతీసింది..? ఎవరు..? అసలు ఆయన మానసిక వేదనతో అస్తమించేందుకు కారణమైంది ఎవరు..? ఆయన ప్రజలు మర్చిపోయేలా చర్యలు తీసుకుంది ఎవరు..? ఎవరి నోట ఎన్టీయార్ పేరు వచ్చినా.. పార్టీలో ప్రాధాన్యాన్ని తగ్గించి చివరకు గుర్తింపు లేకుండా చేసింది ఎవరు..? ఎన్టీయార్ పెట్టిన పార్టీలో ఆయన చిత్రాన్నే లేకుండా చేసి.. గత్యంతరం లేని పరిస్థితులలో మళ్లీ ఆయన బొమ్మను ముద్రించినది ఎవరు..? ఇన్ని చేసిన వాడు గుడినే కాదు.. గుడిలోని లింగాన్ని కూడా మింగినట్టే కదా..? మరి గుడిని గుడిలోని లింగాన్ని మించిన వ్యక్తి పంచన చేరి.. మోకాలికి బొడిగుండుకీ లెంకపెట్టినట్టు.. శంషాబాద్ విమానాశ్రయానికి.. ఎన్టీరామారావు పేరుతో ముడిపెట్టి.. వెఎస్ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో పత్తిపాటికే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Prathipati Pulla rao  Chandrababu Naidu  NTR  AP  

Other Articles