Hardik Patel | Gujarat | Hardik Patel for OBC reservation | OBC Reservation | Gujarat Protest

Hardik patel protesting for patel reservations has the support from that organisation

Hardik Patel, Gujarat,hardik Patel for OBC reservation, OBC Reservation, Gujarat Protest

Hardik Patel protesting for patel reservations has the support from that organisation. Hardik patel protesting strongly in Gujarat and he plans to spread the protest to all states.

హార్దిక్ పాటిల్ ను నడిపిస్తున్న ఆ మూడక్షరాలు..!

Posted: 09/04/2015 05:08 PM IST
Hardik patel protesting for patel reservations has the support from that organisation

22 ఏళ్ల ఓ కుర్రాడు.. దేశంలో అందరికి చెమటలు పట్టిస్తున్నాడు. ఢిల్లీలో ఉన్న మోదీ దగ్గర నుండి గల్లీలోని ఛోటా నాయకుల వరకు అందరూ కూడా హార్దిక్ పటేల్ మీదే మాట్లాడుకుంటున్నారు. అయితే ఓ కుర్రాడు దేశానికి సంబందించి రిజర్వేషన్ అనే కీలకమైన అంశం మీద దేశానికి కొత్త సవాల్ విసురుతున్నారు. గుజరాత్ లోని అగ్రవర్ణాలు పటేల్ లకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో గుజరాత్ లో సాగుతున్న అల్లర్లు,నిరసనలు, విద్వంసాల వెనుక బిజెపి,జన సంగ్ ,అర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఉన్నాయా… అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే పటేల్ లు చేసే డిమాండ్ లో వాస్తవికత లేదని, వారు చేసే డిమాండ్ నిజ రూపం దాల్చదని వాళ్లకు కూడా తెలుసినా కావాలనే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నారు.

* రెండు నెలల ఉద్యమం చేసి ఇన్ని లక్షల మందిని రోడ్ మీదకు తెచ్చి, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడంటే… ఏంటీ అర్థం.? ఎవరి అండాలేకుండా ఇది సాధ్యమా..?

*గుజరాత్ 15% శాతంగా ఉంటూ, ఆర్థికంగా కూడా ఎంతో బలం ఉన్న పటేల్ లు ఎందుకు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది అన్న దాని మీద లోతుగా ఆలోచిస్తే మాత్రం కొన్ని విషయాలు అర్థమవుతాయి. అసలు హార్దిక్ పటేల్ ను వెనకుండి నడిపిస్తున్నది ఎవరు అన్నదాని మీద కూడా అందరం ఆలోచించాలి.

* మొదటి నుండి రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తూ, వీటి మీద జాతీయ చర్చను కోరుకుంటూ… వీలైతే రిజర్వేషన్ అనే  తేనె తుట్టెను కదిపి, అవకాశం ఉంటె రిజర్వేషన్ లనే తీసేసి,కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్ లు ఉండాలని ఎప్పుడు డిమాండ్ చేసే సంగ్ పరివార్ సంస్థల్లో పని చేసే పటేల్ లు రిజర్వేషన్  లు మాకు కావాలని రోడ్ లు ఎక్కడం ఏంటి?

* రిజర్వేషన్ లు 50% మించి ఉండకూడదని సుప్రీం కోర్ట్  చాల స్పష్టంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఎస్సి, ఎస్టి, బిసి లకు గుజరాత్ లో కేటాయించిన మొత్తం  రిజర్వేషన్  49.5%, ఇక ఒకవేళ గుజరాత్ ప్రభుత్వం పటేల్ లను ఓబిసి కోటాలో చేర్చుకోవాలి అనుకున్న కూడా… రిజర్వేషన్ లు 50% మించి ఉండకుడదు అని చెప్పే సుప్రీంకోర్ట్  నిభందనలు అడ్డు వస్తాయి. మరి పటేల్ సామాజిక వర్గం వారికి ఈ విషయాలు తెలియవా..? తెలిసినా ఎందుకు ుద్యమం చేస్తున్నారు..?

* రాష్ట్రములో ఇంత పెద్ద విద్వంసం జరిగి, ఏకంగా హోం మంత్రి ఇంటికే ఆందోళనకారులు నిప్పు పెడుతున్న కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అరెస్ట్ లకు పోకుండా, ఈ అల్లర్లను ఉక్కు పాదంతో అణచివేయకుండా ఇంకా చూస్తూ ఉన్నదీ అంటే, ఎలా అర్థం చేసుకోవాలి...?

* సిసి టివి ఫూటేజిలో పోలీస్ లే అల్లర్లను ప్తోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటే, దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం ధాఖలయ్యి, గుజరాత్ హైకోర్ట్ ప్రభుత్వాన్ని నిలదీసి విచారణకు ఆదేశించే వరకు కూడా ప్రభుత్వం నిమ్మకుండి పోయిందంటే ఎలా అర్థం చేసుకోవాలి.

ఇటువంటి అన్ని సందేహాలకు సమాధానం ఒక్కటే. ఎప్పటి నుండో రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తున్న బిజెపి, అర్ఎస్ఎస్ నాయకులు తెర వెనక నుంచి ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నట్లుంది. ఎందుకంటే ఎంతో కాలంగా ఆర్ఎస్ఎస్ డిమాండ్ కూడా అేద కాబట్టి దానికి హార్దిక్ పాటిల్ ను వాడుకుంటుందని చాలా మంది విశ్లేషకులు బావిస్తున్నారు. మరి దీని మీద క్లారిటీ రావాలంటే ఇప్పట్లో రాదు.. ఎందుకంటే గుజరాత్ ప్రభుత్వం కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ పటేల్లకు అనుకూలంగానో లేదంటే వ్యతిరేకంగానో చర్యలు లేదంటే చట్టాలు తీసుకువస్తే అప్పుడు దీని ప్రభావం కనిపిస్తుంది. అప్పుడు కానీ అసలు ఉద్యమ లక్ష్యం ఏంటో తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles