Cold war between cm kkr and pcc botsa

cm kiran kumar reddy, pcc chief botsa, differences between them, coldwar, news channels, cm kiran news channel comments on botsa, botsa reply, mla’s expulsion, target on cm, congress high command, jagan

differences between CM Kiran Kumar Reddy and PCC chief Botsa

Cold war between CM KKR and PCC Botsa.png

Posted: 02/03/2013 12:13 PM IST
Cold war between cm kkr and pcc botsa

botsa_kiran

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య మళ్ళీ కోల్డ్ వార్ ప్రారంభం అయిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ ఇద్దరు నేతలకు చెరో ఛానల్ ఉండడంతో వాటిలో వచ్చే కథనాలు వీరిద్దరి మధ్య విభేధాలను తారాస్థాయికి చేరవేశాయని అంటున్నారు. దీనికి తోడుగా వారి వర్గీయులు రంగంలోకి దిగి చేస్తున్న ప్రకటనలతో.. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనే అభిప్రాయం కలుగుతుంది. బొత్స సత్యనారాయణ ఆకస్మికంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. రాష్ట్రంలో కొనసాగుతున్నది మైనారిటీ ప్రభుత్వమని ఆయన చెప్పకనే చెప్పారు బొత్సా. లోతైన రాజకీయ వ్యూహంలో భాగంగానే బొత్స ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలుగుతున్న పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ బొత్స వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇది కిరణ్ సర్కారుపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. సీఎం కుర్చీపై ఆశలు పెంచుకుని కిరణ్ సర్కార్‌ను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

kiran_botsa

కిరణ్ వర్గానికి కౌంటర్ గా బొత్స వర్గం ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు.ముఖ్యంగా ఈ వివాదాలపై ముఖ్యమంత్రి కిరణ్ కు చెందిన చానల్ లో బొత్స వ్యతిరేక కధనాలకు ప్రాముఖ్యత లభిస్తున్న తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పైగా జోగి రమేష్ పార్టీ వదలి పెడతారని ఒక ప్రచారంతో పాటు, ఆయన కిరణ్ కు సన్నిహితంగా ఉంటారని మరో ప్రచారం సాగుతుండడం విశేషం. మొత్తానికి... ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. కిరణ్, బొత్సల మధ్య యుద్ధం ముదరడానికి కారణమేంటనే దిశగా ఆలోచిస్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి వీరిద్దరి గొడవ ఎంత దూరం వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aadhaar is a number not an id card
Rangam fame kv anand to work with rajinikanth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more