Rising heart ailments among Indian youth a concern మహిళను చూసి భయంతో దాక్కున్న సింహం..

Mountain lion hides behind a bush as a woman runs past it in california

Mountain lion hides behind bush, Mountain lion on seeing a woman, Mountain lion seeing a runner, Mountain lion hides in California, Mountain lion hides in Ojai city, Mountain lion wild animal, US Mountain lion video, Mountain lion hiding video viral, Mountain lion women running video trending, Mountain lion hides behind bush, woman, runner, California, Ojai city, wild animals, US, viral, trending

Wild animals often cross over into human settlements and go undetected till they are caught on CCTV. It is astonishing to observe their behaviour as they curiously look at humans while hiding innocuously. Something similar was witnessed in a video posted by an Indian Forest Service officer on Twitter.

ITEMVIDEOS: మహిళను చూసి భయంతో దాక్కున్న సింహం.. వీడియో వైరల్

Posted: 10/01/2022 05:09 PM IST
Mountain lion hides behind a bush as a woman runs past it in california

మనుషులంటే జంతువులకు కూడా భయమే.. మనుషులను కూడా అవి శత్రువులుగానే భావిస్తుంటాయి. అందుకే సాధ్యమైనంతవరకు మనుషుల జోలికి రాకుండా అవి దూరంగా ఉంటాయి. ఇక వాటికి మన నుంచి అపద పొంచి ఉంది అనుకున్నప్పుడు మాత్రమే.. తప్పనిసరి పరిస్థితుల్లో దాడి చేస్తాయి. ఇదే విషయాన్ని తనకు దొరికిన ఒక వీడియో చూపిస్తూ చెప్పాడో ఫారెస్ట్ అధికారి. భారత ఫారెస్ట్ అధికారి సుశాంత నంద షేర్ చేసే వీడియోలు చాలా వరకు వైరల్ అవుతుంటాయి. అడవి జంతువులకు సంబంధించిన అరుదైన దృశ్యాలను ఆయన ఎంచుకుని మరీ తన ట్విట్టర్ లో పోస్టు చేస్తుంటారు.

తాజాగా షేర్ చేసిన ఓ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో దేనిదంటారా.. ఒక మౌంటెయిన్ లయన్‌కు సంబంధించిన దృశ్యాలను ఆయన షేర్ చేశారు. అయితే ఈ వీడియోను పోస్టు చేస్తూ ఆయన పెట్టిన కామెంట్లు నెటిజనులను విస్మయానికి గురిచేస్తుండగా, అందుకు సంబంధించినట్లుగా ఉన్న ఈ వీడియో కూడా నెట్టిజనుల చేత ఔరా అనిపిస్తోంది. ఒక మహిళ జాగింగ్ చేస్తూ రావడం చూసిన ఆ సింహం.. వెంటనే పక్కకు తిరిగి అక్కడ ఉన్న ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంటి గేటు పక్కనే ఉన్న పొదల్లో దాక్కొని, సదరు మహిళ దూరంగా వెళ్లిపోయే వరకు వెయిట్ చేసింది.

ఈ వీడియోను షేర్ చేసిన సుశాంత నంద.. ‘మనుషులతో గొడవలను అడవి జంతువులు సాధ్యమైనంతగా ఎవాయిడ్ చేస్తాయి. తమ ప్రాణానికి ముప్పు అనిపించినప్పుడే దాడి చేస్తాయి. పరిగెత్తుకుంటూ వస్తున్న మహిళను చూసి ఒక మౌంటెయిన్ లయన్ ఎలా దాక్కుందో చూడండి’ అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో ఈ వీడియో చూస్తుంటే ఆ సింహం దాక్కున్నట్లుగా లేదని, సరైన టైం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. పులులు, సింహాలు, చిరుతలు.. ఈ జాతికి చెందిన జంతువులు ఎప్పుడూ ఇలాగే చేస్తాయని, అవకాశం దొరకగానే మీదకు దూకుతాయని సదరు ఫారెస్ట్ ఆఫీసరుకు హితబోధ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles