Goddess blesses devotees in Sri Maha Lakshmi Devi avatar ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ..

Goddess blesses devotees in sri maha lakshmi devi avatar on day 5 of dasara festivities

Dussehra Navaratri celebrations, Indrakeeladri, Godess Kanaka Durgamma Devi as Sri Maha Lakshmi Devi, Sri Lalitha Tripura Sundari Devi, Sri Annapurna Devi, Sri Gayatri Devi, fourth Day of Durga Sarannavaratrulu, Sri Annapurna Devi, Sri Annapurna Devi history, Navaratri 4th day Sri Annapurna Devi, Sri Gayatri Devi, Sri Bala Tripura Sundari Devi, Sri Chakra, Sri Yantra pooja, Tirpura Traya, Kanaka Durga Devi Ammavaru, Sri Swarna kavachalankrutha Durga Devi, Vijayawada, Andhra Pradesh

Hill atop shrine Indrakeeladri diety Kanakadurgamma is blessing the devotees in Sri Maha Lakshmi Avatar on the sixth day of the nine-day Dussehra Navaratri celebrations. Kanaka Durgamma Devi Sharannavaratrulu whic began 26th Sepetember, will end on October 5 at the Indrakeeladri Ammavari Temple in Vijayawada.

దేవీ శరన్నవరాత్రులు 6వ రోజు: శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో కనకదుర్గమ్మ..

Posted: 10/01/2022 11:49 AM IST
Goddess blesses devotees in sri maha lakshmi devi avatar on day 5 of dasara festivities

విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి శరన్నవరాత్రులు అక్టోబర్‌ ఆరవ తేదీ వరకు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.

తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజూన బాలత్రిపుర సుందరి అవతారంలో, మూడవ రోజున గాయత్రీ దేవిగా.. నాల్గవ రోజున శ్రీ అన్నపూర్ణ దేవిగా.. ఐదవ రోజున లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనవిచ్చిన కనకదుర్గమ్మతల్లి..ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. శరన్నవరాత్రులలో ఐదవ రోజు అమ్మ లలితా త్రిపుర సుందరీదేవిగా అనుగ్రహిస్తున్న తరుణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రిచే ప్రత్యేకపూజలు చేయించారు. ఉత్సవాలలో కీలకమైన మూలానక్షత్రం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో అందుకు తగ్గట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ముఖ్యమంత్రి జగన్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles