540 acres of land in Kukatpally belongs to Udasin Mutt: SC రూ. 15వేల కోట్ల భూములపై సర్వహక్కులు ఉదాసీన్ మఠానివే: సుప్రీంకోర్టు

Sc rules 540 acre land in y junction at kukatpally belongs to udasin mutt

Kukatpally, Y Junction, land dispute, Hinduja IDL company, India Detonator Ltd, Gulf Oil Corporation, Endowments Department, udasin mutt, 540 acres of land, buffer zone, Special Leave Petition (SLP), High Court, Supreme Court, Telangana

The Supreme Court announced its verdict in Telangana’s favour in connection with 540 acres of endowment land close to Kukatpally Junction. The lands were initially donated to Udasin Mutt in 1904 and its market value located at Hussaini Alam is almost rupees 15,000 crores, but it had 540.30 acres of land in Kukatpally ‘Y’ Junction.

రూ. 15వేల కోట్ల భూములపై సర్వహక్కులు ఉదాసీన్ మఠానివే: సుప్రీంకోర్టు

Posted: 09/15/2022 12:13 PM IST
Sc rules 540 acre land in y junction at kukatpally belongs to udasin mutt

హైదరాబాద్ నగరంలో ఇప్పుడు కూకట్ పల్లికి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. నగరంలోని ఏ ప్రాంతంలోనూ లేనట్టుగా భూదేవి.. ధనలక్ష్మి అవతారం ఎత్తన ప్రాంతం. అలాంటి కూకట్ పల్లికి తలమానికమైన మూసాపేట వై జంక్షన్ వద్దనున్న అత్యంత విలువైన 540.30 ఎక‌రాల స్థలం విషయమై గత కొన్నేళ్లుగా సాగుతున్న కోర్టు కేసులు కొలిక్కవచ్చాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ భూమిపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ ప‌రిధిలో ఉన్న ఉదాసిన్ మ‌ఠానివేనని తేల్చిచెబుతూ కీలక తీర్పును వెలువరించింది. ఈ భూముల విషయంలో ఉదాసిన్ మ‌ఠం, గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ - ఐడీఎల్‌ కెమిక‌ల్స్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

కూక‌ట్‌ప‌ల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఉదాసిన్ మ‌ఠం భూముల‌ను 1964, 1966, 1969, 1978లో నాలుగు ద‌ఫాలుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్‌కు 99 ఏళ్ల కాల వ్యవధికి లీజుకిచ్చింది. అయితే ఈ భూములన్నీ స్థానిక చెరువు ఆనకట్టకు అనుకుని ఉండటంతో బ‌ఫ‌ర్ జోన్‌ పరిధిలోకి చేరాయి. దీంతో బఫర్ జోన్ పరిధిలోని భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్టంలో స్పష్టంగా ఉంది. అయినా వాటిని లెక్కచేయకుండా ఈ భూముల్లో గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ 538 ఎక‌రాల విస్తీర్ణంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని సవాల్‌ చేస్తూ ఉదాసిన్ మ‌ఠం దేవాదాయ శాఖ ట్రైబ్యున‌ల్‌ను ఆశ్రయించింది.

పిటిష‌న్ విచారించిన ట్రైబ్యున‌ల్.. గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్‌కు ఇచ్చిన లీజును 2011లో ర‌ద్దు చేసింది. ట్రైబ్యున‌ల్ తీర్పును స‌వాల్‌ చేస్తూ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. 2013లో డిస్మిస్ చేశారు. హైకోర్టు తీర్పును స‌వాల్‌ చేస్తూ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. యాధాతథస్థితి కొనసాగించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

బ‌హిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ సుమారు రూ.15,000 కోట్లు ఉంటుంద‌ని అంచనా. సుప్రీంకోర్టు తీర్పు ప‌ట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. విలువైన భూముల‌ను కాపాడేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన దేవాదాయశాఖ అధికారులు, శాఖ త‌ర‌ఫున వాదించిన న్యాయ‌వాదుల‌ను ఆయన అభినందించారు. దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కు దేవాదాయ సంస్థలకు మాత్రమే చెందుతుందని సుప్రీంకోర్టు మ‌రోమారు స్పష్టం చేసినట్లైందని.. ఇదే స్ఫూర్తితో ఆక్రమణలో ఉన్న దేవాదాయ శాఖ భూముల‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కృషి చేయాల‌ని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles